అపెక్స్ కౌన్సిల్ భేటీ: నిలదీసిన కేసీఆర్, ఎదిరించిన వైఎస్ జగన్

By telugu teamFirst Published Oct 6, 2020, 5:26 PM IST
Highlights

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాగ్యుద్ధానికి దిగారు, షెకావత్ వారికి సర్దిచెప్పారు.

న్యూఢిల్లీ: నదీ జలాల పంపకాలపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మధ్య వాగ్యుద్ధం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు అపెక్స్ కౌన్సిల్ సమావేశం మంగళవారం జరిగింది. 

అన్నా.. అంటూనే కేసీఆర్ వాదనను వైఎస్ జగన్ వ్యతిరేకించారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంపై కేసీఆర్ అభ్యంతరం చెప్పారు. మొదటి ప్రాజెక్టుకే అనుమతులు లేవని, అటువంటప్పుడు రెండో ప్రాజెక్టును ఎలా చేపడుతారని కేసీఆర్ సమావేశంలో అన్నారు. దానికి జగన్ సమాధానం ఇచ్చారు. 

Also Read: కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతి అపెక్స్ కౌన్సిల్‌దే: గజేంద్ర షెకావత్

కాళేశ్వరం మూడు టీఎంసీల ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని వైఎస్ జగన్ ఎత్తిచూపారు. జగన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షెకావత్ జోక్యం చేసుకుని వారిద్దరికి సర్దిచెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం చూసుకుంటుందని ఆయన చెప్పారు.

హైదరాబాదు నుంచి కేసీఆర్, ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి వైఎస్ జగన్ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాదించుకుంటున్న సమయంలో షెకావత్ జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. డీపీఆర్ లు సమర్పిస్తే కేంద్రం అన్ని ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని షెకావత్ మీడియా సమావేశంలో చెప్పారు. బిల్లులు సమర్పించినంత వరకు నిధులు విడుదుల చేశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తమ సూచన అని చెప్పారు. వీలైతే ఈ నెలాఖరును పోలవరం పందర్శిస్తానని ఆయన చెప్పారు. 

click me!