శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ

By narsimha lodeFirst Published Oct 17, 2018, 4:24 PM IST
Highlights

శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లకుండా నిరసనకారులు  అడ్డుకోవడంతో బుధవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


తిరువనంతపురం:శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లకుండా నిరసనకారులు  అడ్డుకోవడంతో బుధవారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

: India Today journalist Mausami Singh and its crew in a police vehicle. They were attacked by the protesters at Nilakkal base camp. pic.twitter.com/R7rsSBK8fx

— ANI (@ANI)

 

ఆలయంలోకి వెళ్తామని హక్కుల కార్యకర్తలు, మహిళలు తేగేసి చెబుతున్నారు. ఆలయంలోకి  మహిళలను వెళ్లకుండా సంప్రదాయవాదులు, హిందు సంఘాలు  అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆలయం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలపై  చెట్ల పొదల్లో దాక్కొన్న నిరసనకారులు ఒక్కసారిగా రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

దీంతో ఆలయం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించే వారిని సంప్రదాయవాదులు అడ్డుకొంటున్నారు.  కొన్ని చోట్ల మీడియా ప్రతినిధులపై కూడ సంప్రదాయవాదులు దాడికి పాల్పడ్డారు. 

ఈ వార్తను కవరేజీ చేసేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టును అడ్డుకొన్నారు.  ఆలయం వైపుకు వచ్చే  ప్రతి వాహనాన్ని సంప్రదాయవాదులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మహిళలు లేకపోతేనే వాహనాలను  వదిలివేస్తున్నారు.

అయితే సంప్రదాయవాదుల నిరసనలతో పాటు రాళ్ల దాడితో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. నిరసనకారులను తరిమికొట్టారు. ఆలయానికి వెళ్లే మార్గంలో  అన్ని మార్గాల్లో  సంప్రదాయవాదులు అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

నీళక్కల్ వద్ద  ఆందోళనకారులు పోలీసుల  నుండి  లాఠీలు  లాక్కొన్నారు. మీడియాపై దాడికి పాల్పడ్డారు. ఏపీకి చెందిన మాధవి, జర్నలిస్టు లిబీని నిరసనకారులు అడ్డుకొన్నారు. ఆలయ ప్రవేశం చేసేందుకు వచ్చే మహిళలను ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇండియాటుడే జర్నలిస్ట్ మౌసామీ సింగ్ పై నిరసనకారులు దాడికా పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆమెను తమ వాహనంలో రక్షణ కల్పించారు.

సంబంధిత వార్తలు

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి ప్రవేశం కోసం మహిళల యత్నం, రాళ్లదాడి

ఇరుపక్షాల పట్టు: శబరిమల వద్ద ఉద్రిక్తత

శబరిమలలో యుద్ధమేనా... అడుగుపెట్టేందుకు, అడ్డుకునేందుకు రెడీ అయిన మహిళలు

శబరిమలకు వెళ్తా: ఫేస్‌బుక్‌లో మహిళా పోస్టు, హెచ్చరికలు

శబరిమల ఆలయంలోకి మహిళలు.. ‘‘స్టే’’కు సుప్రీం నో..!!

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం: సుప్రీంలో రివ్యూ పిటిషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీం తీర్పుపై మహిళల ఉద్యమం

శబరిమల తీర్పు.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి జయమాల

శబరిమలలోకి మహిళల ప్రవేశం: ఆ మహిళ జడ్జి ఒక్కరే వ్యతిరేకం

సుప్రీం తీర్పు.. శబరిమల ఆలయ పూజారి అసంతృప్తి

మహిళలకు శుభవార్త: శబరిమల ఆలయంలోకి ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్

 

click me!