దివ్యాంగురాలిపై నలుగురు ఆర్మీ జవాన్ల అత్యాచారం...రెండేళ్లుగా ఘాతుకం

By Arun Kumar PFirst Published Oct 17, 2018, 3:02 PM IST
Highlights

దేశ రక్షణ కోసం కాపలాకాస్తూ దేశ సేవ చేయాల్సిన మహోన్నత బాధ్యతను మరిచి నలుగురు ఆర్మీ జవాన్లు దేశం తలదించుకునే నీచమైన పని చేశారు.  ఆర్మీ హాస్పిటల్లో పనిచేసే ఓ దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
 

దేశ రక్షణ కోసం కాపలాకాస్తూ దేశ సేవ చేయాల్సిన మహోన్నత బాధ్యతను మరిచి నలుగురు ఆర్మీ జవాన్లు దేశం తలదించుకునే నీచమైన పని చేశారు.  ఆర్మీ హాస్పిటల్లో పనిచేసే ఓ దివ్యాంగురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఈ ఘాతుకానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  పుణే సమీపంలోని ఖాద్కీ మిలటరీ హాస్పిటల్లో ఓ 30ఏళ్ల మూగ, చెవిటి వితంతు మహిళ గ్రేడ్ 4 ఉద్యోగం చేస్తోంది. అయితే ఆమెకు ఎవరూ లేకపోవడంతో పాటు దివ్యాంగురాలు కావడంతో ఓ ఆర్మీ జవాన్ ఆమెపై కన్నేశాడు. ఓ రోజు నైట్ డ్యూటీలో వున్న ఆమెను బాత్రూంలోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేశాడు.

అయితే ఈ దారుణంపై బాధితురాలు ఓ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసింది. అయితే అతడు కూడా తన కామ వాంఛ తీర్చాలని...లేకుంటే ఈ విషయం బైటపెట్టి పరువు తీస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు. ఇలా అత్యాచారానికి పాల్పడుతూ వీడియోలు తీసిన కీచకులు వాటిని తమ స్నేహితులకు కూడా అందించారు. వీటిని చూపించి బెదిరిస్తూ గత రెండేళ్లుగా నలుగురు ఆర్మీ జవాన్లు ఈ దివ్యాంగురాలిపై అత్యాచారం చేస్తున్నారు.

ఆస్పత్రిలోని అధికారులతో పాటు ఉన్నతాధికారులకు తనపై జరుగుతున్న అఘాయిత్యం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకునేవారు కాదని బాధితురాలు ఆవేధన వ్యక్తం చేసింది. కనీసం నైట్ డ్యూటీని మార్చమని చెప్పినా వినలేదని బోరుమంది. చివరకు ఓ సామాజిక సంస్థ సహకారంతో ఈ బాధితురాలిపై జరుగిన అఘాయిత్యం గురించి బైటపడింది.

ఆ సంస్థ ప్రతినిధులు బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు ఆర్మీ అధికారులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.   

click me!