72 ఏళ్ల వృద్ధురాలిపై రేప్.. ఇంట్లో బంధించి అఘాయిత్యం

By telugu teamFirst Published Nov 17, 2021, 3:47 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో మరో లైంగికదాడి వెలుగులోకి వచ్చింది. 72ఏళ్ల వృద్ధురాలి ఇంటిలో బంధించి ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తర్వాతి రోజు ఆమె ఎలాగోలా ఆ ఇంటి నుంచి తప్పించుకోగలిగింది. కానీ, పక్క వీధిలో నడుస్తూ కిందపడిపోయింది. స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 

ఆగ్రా: Uttar Pradeshలో దారుణం జరిగింది. 72ఏళ్ల వృద్ధురాలి (Old Woman) పై లైంగికదాడి జరిగింది. ఇంట్లో బంధించి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుండగుడు. ఆ ఇంటి నుంచి సోమవారం తప్పించుకుని వీధి గుండా వెళ్తుండగా కింద పడిపోయింది. నిస్సత్తువతో వణుకుతున్న ఆ వృద్ధురాలిని చూసి స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. ఈ ఫోన్‌తో విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో Agraకు చెందిన బొడ్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు సికంద్ర పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్నది. ఆమె పని కోసం వెతుకుతున్నది. ఇదే అదునుగా చేసుకున్న ఓ దుండగుడు ఆమెకు పని ఇప్పిస్తానని చెప్పి మాయమాటలు చెప్పాడు. అవి నమ్మి ఆ వృద్ధురాలు ఆదివారం (ఈ నెల 14వ తేదీ) సాయంత్రం బొడ్లాకు వెళ్లింది. బొడ్లా క్రాసింగ్ వద్దకు ఆ దుండగుడు వచ్చి ఆమెను తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఓ ఇంటిలో బంధించాడు. ఆమెను Rape చేశాడు.

Also Read: మహారాష్ట్రలో దారుణం.. మైనర్ బాలికపై పోలీసు సహా 400 మంది రేప్ 

ఆ తర్వాత ఇంటి నుంచి బయట పడటానికి ఆ వృద్ధురాలు ప్రయత్నించింది. సోమవారం ఉదయం ఎలాగోలా ఆమె బయట పడగలిగింది. పక్కనే ఉన్న వీధిలో నడుస్తూ వెళ్తూ కింద తూలిపడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య తమకు 112 ద్వారా స్థానికులు ఫోన్ చేశారని పోలీసులు చెప్పారు. 

Also Read: అమానుషం : సంతానం కోసం.. యువతిని కొనుక్కొచ్చి, 16నెలలు బంధించి అత్యాచారం.. సహకరించిన భార్య...

52ఏళ్ల నిందితుడిని పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు జగదీశ్‌పుర పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు. వృద్ధురాలిని హాస్పిటల్ పంపినట్టు తెలిపారు. విచారణలో తమకో కీలక విషయం తెలిసినట్టు చెప్పారు. ‘నిందితుడు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లుతున్నట్టు చెప్పాడు. అయితే, అక్కడ వంటలు చేయడానికి మనిషి అవసరం ఉన్నదని తెలిసిందని వివరించాడు. అందుకే, అక్కడ వంటలు చేయడానికి తనకో మహిళ అవసరం వచ్చిందని చెప్పాడు’ అని ఆ పోలీసు అధికారి వివరించారు.

ఉత్తరప్రదేశ్ ఇలాంటి ఘటనలే గతంలోనూ కలకలం రేపాయి. ఈ ఏడాది జులైలో మహోబా జిల్లాలో 65 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం జరిగింది. బాధితురాలి కాళ్లు, చేతులు కట్టేసి దారుణమైన స్థితిలో కనిపించారు. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదైంది. ఫిబ్రవరిలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అది కూడా మహోబా జిల్లాలోనే జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబం పెళ్లి కోసం వెళ్లగా.. ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్నారు. అప్పుడే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబం తిరిగి ఇంటి వచ్చే సరికి ఆ వృద్ధురాలు తీవ్ర కడుపు నొప్పిత ఏడుస్తూ కనిపించారు. జరిగిన ఘటనను వారికి తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది.

click me!