నగ్న చిత్రాలు చూపించి.. తండ్రికే కొడుకు బ్లాక్ మెయిల్.. రూ.10కోట్లు కావాలంటూ..

By telugu news teamFirst Published Jan 28, 2021, 1:58 PM IST
Highlights

నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.10కోట్లు డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే.. అతనిని బ్లాక్ మెయిల్ చేసింది అతని సొంత కన్న కొడుకే కావడం గమనార్హం. 

ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ లు బాగా పెరిగిపోతున్నాయి.  ఒక్కొక్కరు ఒక్కోరకంగా మోసపోతున్నారు.  సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజేవారు కూడా ఉన్నారు. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి కూడా ఎదురైంది. నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.10కోట్లు డిమాండ్ చేశారు. విచిత్రం ఏమిటంటే.. అతనిని బ్లాక్ మెయిల్ చేసింది అతని సొంత కన్న కొడుకే కావడం గమనార్హం. ఈ సంఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఘ‌జియాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఈ-మెయిల్ వారం రోజుల క్రితం హ్యాక్ అయింది. ఆ త‌ర్వాత వ్య‌క్తి మెయిల్‌కు అత‌నికి సంబంధించిన అస‌భ్య‌క‌ర‌మైన చిత్రాల‌ను పంపించారు. త‌న‌కు రూ. 10 కోట్లు ఇవ్వ‌క‌పోతే ఆ ఫోటోల‌తో పాటు కుటుంబ స‌భ్యుల ఫోటోల‌ను కూడా వైర‌ల్ చేస్తాన‌ని బెదిరించాడు. దీంతో అత‌ను భ‌య‌ప‌డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అయితే ఆ వ్య‌క్తి మెయిల్‌ను హ్యాక్ చేసింది.. ఆయ‌న కుమారుడే(11) అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. దీంతో కుటుంబ స‌భ్యులు షాక్‌కు గుర‌య్యారు. ఐదో త‌ర‌గ‌తి చదువుతున్న ఆ బుడ్డోడు.. మెయిల్‌ని ఎలా హ్యాక్ చేయాలో యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న‌ట్లు తేలింది. ఆ త‌ర్వాత తండ్రి మెయిల్‌ను హ్యాక్ చేసి.. యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌, ఫోన్ నంబ‌ర్‌ను మార్చాడు. ఇక అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోల‌తో తండ్రిని బెదిరిస్తూ రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడు.

click me!