ఇదేం మేకప్ రా బాబు.. సొంత కొడుకే గుర్తుపట్టలేకపోతున్నాడు

By Shivaleela RajamoniFirst Published Mar 26, 2024, 9:46 AM IST
Highlights

ఆడవాళ్లకు మేకప్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మేకప్ చేసే మాయ అంతా ఇంతా కాదు మరి. మన ముఖాన్ని మన ముఖం కాకుండా చేసిసి కళ్లను మోసం చేస్తుంది. అయితే ఓ మహిళ తన కొడుకుతో పార్లర్ కు వెళ్లింది. మేకప్ వేసుకుని అందంగా రెడీ అయ్యింది. కానీ ఆమె కొడుకు మా అమ్మ ఏదని ఎంతలా ఏడుస్తున్నాడో తెలుసా?
 

ఆడవాళ్లు రెగ్యులర్ గా అందంగా రెడీ అవుతారు. ఇది సర్వసాధారణ విషయం. ఎన్ని పనులున్నా.. అన్నీ కంప్లీట్ చేసుకుని మరీ ముస్తాబవుతుంటారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు, దావత్ లకైతే ఎంతలా రెడీ అవుతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పార్లర్ లకు క్యూ కట్టి మరీ ముస్తాబవుతుంటారు. అయితే కొంతమంది మేకప్ ను  తక్కువగా వేసుకుంటే.. మరికొంతమంది మాత్రం ముఖంపై మచ్చలు, మొటిమలు, డార్క్ సర్కిల్స్ కనిపించకుండా అందంగా కనిపించాలని ఓవర్ గా మేకప్ వేసుకుంటుంటారు. నిజానికి మేకప్ తో మన ఒరిజినల్ ముఖం లేకుండా చేయొచ్చు. అంటే మన ముఖాన్ని మన ముఖం కాకుండా చేసుకోవచ్చు. ఇలా రెడీ అయ్యి ఎంతోమందిని మోసం చేసిన వీడియోలను కూడా వార్తల్లో మీరు చూసే ఉంటారు. 

మరి మేకప్ చేసే మాయ అంతా ఇంతా కాదు. ఎంత పెద్దవయసు వారి ముఖాన్నైనా యంగ్ ముఖంలా మార్చేస్తుంది ఈ మేకప్. అందుకే కదా ఈ రోజుల్లో మేకప్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి రకరకాల మేకప్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. వీటి రేట్లు కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఈ సంగతంతా ఎందుకంటే..  మేకప్ వేసుకున్న మహిళను తన కొడుకే గుర్తుపట్టలేక పోయాడు. అంతేకాదు మా అమ్మ ఎక్కడా అంటూ ఎంతలా ఏడుస్తున్నాడో తెలుసా? ఈ వీడియో ఫేస్ బుక్ లో బాగా వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళ తన కొడుకుతో పాటుగా పార్లర్ కు వెళ్లింది. మేకప్ వేసుకుని అందంగా ముస్తాబయ్యింది. ఇదంతా బానే ఉంది. కానీ వెంట వచ్చిన కొడుకు మాత్రం ఆ తల్లిని గుర్తించలేకపోయాడు. పైగా మా అమ్మ ఎక్కడా ? ఎక్కడా? అని ఏడుస్తున్నాడు. నేనే మీ అమ్మను అని ఆ తల్లి చెప్పినా నువ్ కాదు మా అమ్మ అంటూ ఒక్కటే ఏడుస్తున్నాడు. పార్లర్ లో ఉన్నవాళ్లు తనే మీ అమ్మ చెప్పినా కాదనే అంటున్నాడు తప్ప నమ్మడం లేదు. ఆ తల్లిదగ్గరకు తీసుకుని నేనే అమ్మను అని చెప్పినా.. ముఖం చూసి ఎంతలా ఏడుస్తున్నాడో చూస్తే మీరు నవ్వాపుకులేరు.  


 

దేశంలొ వున్న అన్ని బ్యూటీ పార్లర్‌లకు నా హృదయపూర్వక విజ్ఞప్తి: దయచేసి చిన్న పిల్లలు తమ తల్లులను గుర్తించగలిగేంత వరకు మాత్రమే అందమైన మహిళల అలంకరణను పరిమితం చేయండి! పిల్లలు తమ తల్లులను గుర్తు పట్టలేక పోతున్నారు పాపం...!!!

Posted by Ganesh Thota on Sunday, March 24, 2024
click me!