‘అన్నం మంచిదే...’ ఈ కారణాలు తెలిస్తే మీరూ ఒప్పుకుంటారు....

By AN TeluguFirst Published Oct 21, 2021, 11:55 AM IST
Highlights

అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమా? బరువు పెరగడంలో Rice వ్యతిరకేంగా పనిచేస్తుందా? మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? అంటే.. ప్రముఖ పోషకాహార నిపుణుల  ప్రకారం, బియ్యం ప్రయోజనాలతో నిండి ఉంది. ఆ ప్రయోజనాలేంటో కూడా చెప్పుకొచ్చారు. 

శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించాలన్నా.. వయసుకు, ఎత్తుకు తగినంత బరువులోనే ఉండాలన్నా.. ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? దానివల్ల ఎంతవరకు శరీరానికి ఉపయోగం ఉంటుంది? అనేది ఆలోచించుకోవాలి. దీనికోసం చాలామంది నోరు కట్టుకుని మరీ డైటింగ్ చేస్తుంటారు. 

weight loss కావాలనుకునేవారు ముఖ్యంగా మొదట మానేసేది అన్నం తినడం. అన్నంలోని Carbohydrates వల్ల ఏమీ ఉపయోగం ఉండదని.. అందుకే అది తినడం మానేసినా తమ శరీరానికి ఎలాంటి తేడా ఉండదని నమ్ముతారు. పైగా అన్నం రూపంలో తీసుకునే కార్బ్స్ ను కట్ చేయచ్చని విశ్వసిస్తారు. అయితే, ఇది నిజమేనా?

అన్నం తినడం ఆరోగ్యానికి హానికరమా? బరువు పెరగడంలో Rice వ్యతిరకేంగా పనిచేస్తుందా? మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు? అంటే.. ప్రముఖ పోషకాహార నిపుణుల  ప్రకారం, బియ్యం ప్రయోజనాలతో నిండి ఉంది. ఆ ప్రయోజనాలేంటో కూడా చెప్పుకొచ్చారు. 

ప్రీబయోటిక్
అన్నం ప్రీబయోటిక్. ఈ Prebiotic మీ కడుపును నింపడమే కాదు. సంతృప్తిని ఇస్తుంది. కడుపులో ఉండే రకరకాల సూక్ష్మజీవుల (గట్) పర్యావరణ వ్యవస్థను కూడా సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. 

వర్సటైల్ 
హ్యాండ్ మిల్లింగ్ చేసిన, సింగిల్ పాలిష్ చేసిన బియ్యాన్ని.. అన్నం నుంచి కంజి, ఖీర్ వరకు వివిధ రకాలుగా Versatileగా వండుకోవచ్చు

రక్తంలో చక్కెర స్థాయిలు
దహీ, కధి, చిక్కుళ్ళు, నెయ్యి, మాంసంతో కలిపి అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మామూలుగా blood sugar levels విషయంలో ఇబ్బంది పడే డయాబెటిస్ పేషంట్లు అన్నానికి దూరంగా ఉంటారు. అయితే నిపుణులు చెబుతున్నది దీనికి విరుద్ధంగా ఉండడం విచిత్రం. 

జీర్ణక్రియ
అన్నం తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో తేలికగా ఉంటుంది. అన్నం తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది, ఇది వృద్ధులు, యువకులకు అవసరమైన మెరుగైన హార్మోన్ల సమతుల్యతకు దారితీస్తుంది.

చర్మానికి మంచిది
బియ్యం నిజానికి మంచిది కాదు. కానీ చర్మానికి చాలా మంచిది. ఇది అధిక ప్రొలాక్టిన్ స్థాయిల వల్ల ఏర్పడే  enlarged poresను తగ్గించుకోవడానికి సాయపడుతుంది. 

జుట్టు
బియ్యం జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. ఇది బలహీనమైన థైరాయిడ్ స్రావం వల్ల దెబ్బతిన్న hairను సరిచేయడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అంతా ఉపయోగమే..
బియ్యంలోని ప్రతీదీ ఉపయోగకరంగానే ఉంటుంది. వడ్లను పట్టించినప్పుడు వచ్చిన ఊక పశువుల దాణాగా, బియ్యం మనం తినడానికి, వరిగడ్డి కూడా పశువుల దాణాగా ఉపయోగపడుతుంది. 

మట్టికీ మంచిది
వరి వేసిన భూమిలో ఆ తరువాత పప్పుధాన్యాలు వేయడానికి కావాల్సినంత తేమను భూమికి అందిస్తుంది. అంతేకాదు వరి సహజ నైట్రోజన్ ఫిక్చర్‌గా పనిచేయడం ద్వారా నేలను మరింత సుసంపన్నం చేస్తుంది.

తరాలుగా వస్తున్న అలవాటు..
బియ్యం స్థానికమైనది, కాలానుగుణమైనది. తరతరాలుగా అన్నం తినడం వారస్వతంగా వచ్చినది.. ఇది ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, జీవావరణ శాస్త్రాన్ని కాపాడుతుంది. అందుకే అన్నం స్వచ్ఛమైన బంగారం కంటే తక్కువ కాదు.

మరిగించిన నిమ్మరసం తాగితే అద్భుతాలు జరుగుతాయి తెలుసా..?

click me!