మహిళలే కాదు.. పురుషులు కూడా గృహ హింసకు గురవుతున్నారు..! ప్రతి ముగ్గురు బాధితుల్లో.. ఒకరు పురుషుడే..

By Mahesh RajamoniFirst Published Jun 21, 2022, 2:56 PM IST
Highlights

ఇది వినడానికి కాస్త వింతగా.. ఆశ్చర్యకరంగా అనిపించినా.. పెళ్లాల చేతిలో గృహ హింసకు గురయ్యే పురుషులు కూడా చాలా మందే ఉన్నారని  తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.. 
 

గృహ హింస అంటే మనందరికీ మందుగా గుర్తొచ్చేది మహిళలే. ఎందుకంటే ఈ దారుణాల గురించి ఎక్కువగా బయటపట్టేది ఆడవారే కాబట్టి. గృహ హింస చేస్తున్నాడని తమ భర్తలపై కేసులు పెట్టడం, విడాకులు తీసుకోవడం వంటి వార్తలన్నే మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందుకే కేవలం మహిళలలే గృహ హింసకు గురవుతారని మనం భావిస్తాం. వాస్తవానికి పురుషులు కూడా గృహ హింస బారిన పడుతున్నారని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వినడానికి వింతగా.. కాస్త ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది నూటికి నూరు పాల్లు నిజం. 

పరువు పోతుందనో , సమాజానికి భయపడో లేక అహంకారం కారణంగానో.. మరేదో కారణం వల్లనో గాని పురుషులు తమపై జరిగే గృహ హింస గురించి బయటపపెట్టడం లేదంతే.. కాగా బ్రిటన్ లో పురుషులపై గృహ హింస కేసులు వేగంగా పెరిగుతున్నాయి. అందుకే పురుషులకు సహాయం చేయడానికి అక్కడ అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. UKలో Man's kind అనేది పురుషుల కోసం పనిచేసే ఒక సంస్థ. 

ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒకరు పురుషుడు..

Man's kind ప్రకారం.. యుకెలో గృహ హింసతో బాధపడుతున్న ప్రతి ముగ్గురిలో ఒకరు పురుషుడు ఉన్నాడు. 30 ఏళ్ల హుస్సేన్ (పేరు మార్చాం) బీబీసీతో మాట్లాడుతూ.. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత తన భార్య చేతిలో గృహ హింసకు గురయ్యానని చెప్పారు. ఆమె హుస్సేన్ ను మానసికంగానే కాదు శారీరకంగా, ఆర్థికంగా హింసించింది. ఇబ్బంది కారణంగా.. నేను ఈ విషయాన్ని ప్రస్తావించలేకపోయానన్నారు. మెయిన్ రీచింగ్ సంస్థ అవుట్ సహాయంతో.. హుస్సేన్ గృహ హింస నుంచి బయటపడి.. తన భార్యతో విడిపోయాడు.

పురుష గృహ హింస కేసులు వేగంగా పెరుగుతున్నాయి..

Man's kind ప్రకార౦..  2004లో గృహహింసకు పాల్పడిన స్త్రీల స౦ఖ్య 806. అది 2020 నాటికి 4,948కి పెరిగింది. అంటే ఈ సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ఈ సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, దక్షిణాసియా పురుషులకు సహాయం చేయడానికి మెన్ రిచింగ్ అవుట్ అనే సేవా సంస్థను ప్రారంభించారు. ఇది గృహ హింసకు గురైన పురుషులకు సహాయపడుతుంది. దీన్నిహెల్ప్ లైన్ నంబర్ ద్వారా ప్రారంభించారు. అక్కడ పురుషులు కాల్ చేసి సహాయం కోసం అడుగుతారు. మొదట్లో 10 నుంచి 15 కాల్స్ వచ్చేవని మెయిన్ రీచింగ్ అవుట్ సీఈఓ హుమాయూన్ ఇస్లాం బీబీసీకి తెలిపారు. కానీ ఇప్పుడు ప్రతి నెలా 50 కి పైగా కాల్స్ వస్తున్నాయి. గృహ హింస బాధితులుగా మారిన పురుషులతో మేము మాట్లాడుతాము. ఆ సంబంధం నుంచి వారిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. దీనితో పాటుగా ప్రతి నెలా ఎవరైతే పురుషులు భార్యలచే హింసకు గురవుతారో వారందరినీ సమావేశపరుస్తారట. ఆ సమావేశంలో వారు తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ సంస్థ హింసకు గురవుతున్న పురుషులను ఆ బంధం నుంచి బయటపడేలా చేస్తుందని ఆ సంస్థ వెల్లడించింది.

భారతదేశంలో 90% మంది పురుషులు గృహ హింసకు గురవుతున్నారు.

భారతదేశంలో గృహ హింసకు సంబంధించిన చట్టాలన్నీ మహిళల ప్రయోజనాల దృష్ట్యా రూపొందించబడ్డాయి. దీని కారణంగా గృహ హింసకు గురైన పురుషుల సంఖ్య బయటకు రాలేకపోతోంది.'Save Indian Family Foundation', 'My Nation'అనే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో..  భారతదేశంలో 90 శాతానికి పైగా భర్తలు మూడు సంవత్సరాల సంబంధంలో కనీసం ఒక్కసారైనా గృహ హింసను ఎదుర్కొంటున్నారని కనుగొన్నారు. ఇక ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెల్లినప్పుడు.. పోలీసులు వారి మాట వినడానికి బదులుగా వారిని నవ్వించే స్టాక్ గా మారుస్తున్నారట.

click me!