ఒక్కసారి తలుచుకుంటే చాలు.. బీపీ తగ్గిపోతుందట

By ramya NFirst Published Feb 12, 2019, 2:29 PM IST
Highlights

పని ఒత్తిడి కారణంగానో..ఇంకోటేదైనా కారణంగానో చాలా మందికి బీపీ రావడం సహజం. అలాంటి సమయంలో ఒక్కసారి కళ్లు మూసుకొని తమ ప్రియుడు లేదా ప్రేయసిని తలుచుకుంటే.. బీపీ చిటికెలో మాయమౌతుందట.

పని ఒత్తిడి కారణంగానో..ఇంకోటేదైనా కారణంగానో చాలా మందికి బీపీ రావడం సహజం. అలాంటి సమయంలో ఒక్కసారి కళ్లు మూసుకొని తమ ప్రియుడు లేదా ప్రేయసిని తలుచుకుంటే.. బీపీ చిటికెలో మాయమౌతుందట. మీ ప్రియమైన వారితో గడిపిన మధుర క్షణాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే.. ఒత్తిడంతా పోయి.. మనసు ప్రశాంతంగా మారుతుందని.. పెదాలపై చిరునవ్వు మెరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

అరిజోనా విశ్వవిద్యాలయ మానసిక నిపుణులు ఈ అంశంపై తాజాగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని వారు చెబుతున్నారు. కొందరు లవర్స్ ని ఎంపిక చేసి రెండు భాగాలుగా విభజించారు. అనంతరం రెండు టీమ్స్ లోని వారికి కొన్ని కష్టమైన పనులు ఇచ్చారు.

కాగా ఆ పని కారణంగా వారు ఒత్తిడికి గురయ్యారట. ఆ ఒత్తిడిని తగ్గించేందుకు ఒక టీంలోని వారికి తమ లవర్స్ ని గుర్తుచేసుకోవాల్సిందిగా కోరామని.. వారితో గడిపిన మధురక్షణాలు గుర్తుచేసుకోవాలని చెప్పినట్లు తెలిపారు.  మరో టీంలోని వాళ్లకు ఇలాంటివి ఏమీ చెప్పలేదు. కాగా.. తమ లవర్స్ ని తలుచుకున్న వారి బీపీ నార్మల్ అయిపోయిందని.. తలుచుకోని వారి బీపీ మాత్రం తీవ్రస్థాయిలో ఉన్నట్లు వారు గుర్తించారు.

click me!