మాజీ ప్రియుడిపై కోపం.. ఎలా రివేంజ్ తీర్చుకుందంటే..!

By telugu news teamFirst Published Jul 10, 2021, 10:59 AM IST
Highlights

కియాన్.. కి ఓ కార్ల కంపెనీ ఉంది. తన కార్లన్నింటినీ అద్దెకు ఇచ్చి.. ఆ వచ్చిన డబ్బులో గడుపుతూ ఉంటాడు. అయితే.. అతని కారును తన ఫ్రెండ్ సహాయంతో అద్దెకు తీసుకుంది.

ప్రేమలో ఉన్నప్పుడు వారికోసం ఏదైనా చేయాలని అనిపిస్తుంది. వారి కోసం ఎంత దూరమైనా వెళ్లాలని అనిపిస్తుంది. అయితే.. మనం ప్రాణం ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి.. మనకు బ్రేకప్ చెబితే.. అది భరించడం కష్టమే. అంత వరకు ఉన్న ప్రేమ ధ్వేషంగా మారే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఓ యువతి విషయంలోనూ అదే జరిగింది. ఆమెను తన బాయ్  ఫ్రెండ్ వదిలేశాడు. దీంతో.. అతనిపై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది. అంతే.. ప్లాన్ ప్రకారం ఇరికించేసింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... చైనా కి చెందిన కియాన్ అనే యువకుడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. బాయ్ ఫ్రెండ్ అలా తనకు బ్రేకప్ చెప్పడాన్ని సదరు యువతి తట్టుకోలేకపోయింది. ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంది.

కియాన్.. కి ఓ కార్ల కంపెనీ ఉంది. తన కార్లన్నింటినీ అద్దెకు ఇచ్చి.. ఆ వచ్చిన డబ్బులో గడుపుతూ ఉంటాడు. అయితే.. అతని కారును తన ఫ్రెండ్ సహాయంతో అద్దెకు తీసుకుంది.

ఆ కారుతో దాదాపు 49సార్లు కావాలని సిగ్నల్ జంప్ చేసింది. కేవలం రెండు రోజుల్లో ఆమె 49 సార్లు సిగ్నల్ జంప్ చేయడం గమనార్హం. దీంతో... పోలీసులు ఆ కారుపై కన్నేశారు.

కారు డ్రైవ్ చేసిన వ్యక్తితో పాటు,..  యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే.. కియాన్ తాను.. కారు అద్దెకు ఇచ్చానని చెప్పాడు. కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని ఆరా తీయగా.. కియాన్ మాజీ ప్రేయసి రివేంజ్ ప్లాన్ బయటపడింది. కానీ.. ఫైన్ మాత్రం కియాన్ చెల్లించాల్సి వచ్చింది. మాజీ ప్రేయసి ఇచ్చిన ట్విస్ట్ కి కియాన్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడింది. 

click me!