పోర్న్‌కి బానిసలవుతున్న భారతీయ చిన్నారులు .. 13 ఏళ్లకే ఆ వీడియోలు కావాలట, నిపుణుల హెచ్చరికలు

By Siva Kodati  |  First Published Sep 29, 2023, 6:29 PM IST

భారతదేశంలో చిన్న వయస్సులోనే పిల్లలు అశ్లీలత, పోర్న్‌కు బానిసలవుతున్నారట. 13 సంవత్సరాల వయస్సులోనే పిల్లలు పోర్న్ వీక్షిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పిల్లలను అశ్లీల వ్యసనం వైపు నడిపించడంలో నాణ్యత లేని కుటుంబ వాతావరణాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


భారతదేశంలో చిన్న వయస్సులోనే పిల్లలు అశ్లీలత, పోర్న్‌కు బానిసలవుతున్నారట. 13 సంవత్సరాల వయస్సులోనే పిల్లలు పోర్న్ వీక్షిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. పోర్న్ సైట్‌లను బ్లాక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, వినియోగం మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంది.  నిషేధానికి తీసుకుంటున్న చర్యలు ఊహించని విధంగా పోర్న్ చూడాలనే ఉత్సుకతను మరింతగా రేకెత్తించింది.

తమ తల్లిదండ్రులకు దూరంగా వుండే పిల్లలు ఎక్కువగా అశ్లీలతకు అలవాటు పడే ప్రమాదం వుంటుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను అశ్లీల వ్యసనం వైపు నడిపించడంలో నాణ్యత లేని కుటుంబ వాతావరణాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బెంగళూరుకు చెందిన ఏడేళ్ల బాలుడు ఇంట్లోని పరిస్ధితుల దృష్ట్యా ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికి అడల్ట్ కంటెంట్ వైపు మళ్లినట్లు ఉదాహరణతో సహా చెబుతున్నారు నిపుణులు. 

Latest Videos

undefined

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (Nimhans)లో  SHUT క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ అండ్ కో ఆర్డినేటర్ అయిన డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ.. ఓ పిల్లవాడు ఎలాంటి అంశాల ద్వారా ఉపశమనం పొందినది వివరించారు. క్లినికల్ సైకాలజీపై జాతీయ సదస్సులో ప్యానెల్ చర్చ సందర్భంగా నిపుణులు మెదడుపై అశ్లీలత ప్రతికూల ప్రభావాలను చర్చించారు. డాక్టర్ నితిన్ ఆనంద్ (క్లినికల్ సైకాలజీ అదనపు ప్రొఫెసర్ అండ్ SHUT క్లినిక్‌లో కన్సల్టెంట్) మెదడులోని డోపమైన్ రివార్డ్ సిస్టమ్‌పై ప్రభావాన్ని పరిశీలించారు. 

యుక్తవయస్సులో ఉన్నవారు అశ్లీల చిత్రాలను అధికంగా చూడటం వల్ల మెదడులోని ఆనంద కేంద్రానికి ఎలా అంతరాయం కలిగిస్తుందో, అది పనిచేయకపోవడానికి ఎలా దారితీస్తుందని ఆయన వివరించారు. ఎలివేటెడ్ డోపమైన్ ఉత్పాదన కేంద్రం అధిక-ప్రేరేపణ అనుభవాల నుండి మాత్రమే ఆనందాన్ని పొందేలా చేస్తుంది. సారూప్య ఉద్దీపనల నుండి సంతృప్తత కారణంగా వ్యక్తులు కొత్తదనాన్ని కోరుకునేలా చేస్తుంది.

పిల్లలలో అశ్లీల వినియోగం విస్తృతమైన సమస్యకు ప్రధాన కారణం.. లైంగిక విద్యపై అవగాహన కల్పించకపోవడం, సులభంగా ఇంటర్నెట్ సదుపాయాలు పెరగడమేనని నిపుణులు తెలిపారు. పెరుగుతున్న ఈ ఆందోళనను పరిష్కరించడానికి పాఠశాల పాఠ్యాంశాల్లో లైంగిక విద్యను చేర్చాల్సిన తక్షణ అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్పారు. దీనికి అదనంగా వారు వీకెండ్ ప్రభావాలపైనా చర్చించారు. వారాంతాల్లో దాదాపు 80 శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ అశ్లీలతకు సంబంధించినదే వుంటుందని వెల్లడించారు. వ్యక్తులు విశ్రాంతి, ఆనందం కోసం వీకెండ్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 

అంతేకాకుండా.. కుటుంబ, స్నేహ సంబంధాలపై అశ్లీల ప్రభావం గురించి కూడా నిపుణులు చర్చించారు. అశ్లీల చిత్రాలను చూసే భాగస్వామిని కలిగి ఉండటం దీర్ఘకాలిక సంబంధాలను దెబ్బతీస్తుందని, ఇది ఇద్దరి మధ్య సన్నిహిత  సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. డాక్టర్ శర్మ ఈ సమస్య పరిణామాలను హైలైట్ చేశారు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి బహిరంగ సంభాషణల అవసరాన్ని నొక్కి చెప్పారు.

click me!