కరోనా .. లేక డెంగీ జ్వరమా..?

By telugu news teamFirst Published Jun 27, 2020, 2:45 PM IST
Highlights

ఈ క్రమంలో డెంగీ లక్షణాలు.. దాని నుంచి కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం ఇప్పుడు తెలుసుకుంది. 

ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. కాగా.. దీనికి తోడు వర్షాలు పడతుండటంతో దోమల వ్యాప్తి కూడా పెరిగిపోతోంది. డెంగీ దోమల వ్యాప్తి మొదలైందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో డెంగీ లక్షణాలు.. దాని నుంచి కోలుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనం ఇప్పుడు తెలుసుకుంది. చాలా మంది ప్రస్తుతం జ్వరం వస్తే చాలు కరోనా అని భయపడిపోతున్నారు. అయితే.. డెంగీ కూడా వచ్చే అవకాశం ఉంది ఈరోజుల్లో. కాబట్టి.. ఈ రెండిటి విషయంలో కొంత క్లారిటీ గా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

డెంగీ లక్షణాలు..

డెంగీ జ్వరం ఈడిస్‌ దోమ కుట్టడం వల్ల వస్తుంది.దోమ కుట్టిన 24 గంటల్లోనే విపరీతమైన తలనొప్పి వస్తుంది. జ్వర తీవ్రత పెరిగే కొద్దీ కళ్లు ఎర్రగా మారుతుంటాయి.
మరుసటి రోజు కండరాల నొప్పి, అనంతరం మోకాళ్లు, ప్రతి కీలు వద్దా నొప్పి తీవ్రత. ఒళ్లంతా దద్దుర్లలా మొదలై, ఎర్రగా మారతాయి.
ఆహారం తీసుకోవాలనిపించదు, తీసుకున్నా వాంతులవుతాయి డెంగీ హీమరోజిక్‌ ఫీవర్‌ (డీహెచ్‌ఎఫ్‌) అంటే ఎక్కువ తీవ్రత ఉన్నట్టు ఇక చివరి దశను డెంగీ షాక్‌ సిండ్రోమ్‌ (డీఎస్‌ఎస్‌) అంటారు. 

డెంగీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఇంటి ఆవరణంలో కొబ్బరి చిప్పలు, టైర్లు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సెప్టిక్‌ ట్యాంకులు తదితర వాటికి నైలాన్‌ దారంతో కూడిన మెష్‌లు కట్టుకోవాలి.  రాత్రిపూట వీలైనంత వరకూ దోమతెరలు వాడాలి. ఇంటి ఆవరణాన్ని పొడిగా ఉంచాలి. 

డెంగీకి చికిత్స ఇలా..

డెంగీ జ్వరాన్ని ఎలీశా టెస్టు ద్వారా నిర్ధారిస్తారు. ఫిజీషియన్‌ సూచనల మేరకు యాంటీబయోటిక్స్‌ ఇవ్వాలి.యాంటీవైరల్‌ ఇంజక్షన్లు, జ్వర తీవ్రతను తగ్గించేందుకు పారాసెటిమాల్‌ ఇవ్వాలి 
రోగికి పళ్లు, పళ్ల రసాలు ఆహారంగా ఇవ్వాలి. పరిస్థితిని బట్టి ఐవీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించాలి.రోగికి వీలైనంత ఎక్కువ మోతాదులో నీరు తాగించాలి 

click me!