లైఫ్ స్టైల్ మార్చుకోవడం..
క్రమం తప్పకుండా ఈ ప్రక్రియను కొనసాగించండి
వారానికి ఒకసారి లేదా రెండు సార్లు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడటంతోపాటు, దెబ్బతిన్న జుట్టు నెమ్మదిగా తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా ఈ దినచర్యను నిరంతరం కొనసాగిస్తే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కనబడతాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరం
నూనె రాయడమే కాదు, పోషకాహారంతో కూడిన ఆహారం, తగినంత నీరు, సరైన నిద్ర, రోజువారీ వ్యాయామం, ఒత్తిడి నివారణ వంటి లైఫ్ స్టైల్ మార్పులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. విటమిన్ A, C, D, E, B-కాంప్లెక్స్, ప్రోటీన్, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం అవసరం.