శని మార్పు..
నవ గ్రహాల్లో శని దేవుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే.. మనం చేసే పనులకు తగిన ఫలితం అందించడంలో శని పాత్ర చాలా కీలకం. మనం మంచి పనులు చేస్తే మనకు వచ్చే ప్రతి ఫలం కూడా మంచిగా ఉంటుంది. కానీ, చెడు పనులు చేస్తే కచ్చితంగా దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఇదంతా కూడా శని ప్రభావమే. అందుకే శనిని అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇక ఈ శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెట్టడానికి కనీసం రెండున్నరేళ్లు పడుతుంది. అంతేకాదు, ప్రతి నక్షత్రంలోనూ నాలుగు పాదాలుగా సంచరిస్తూ ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 28న శని ఉత్తరభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించగా..త్వరలోనే రెండో పాదంలోకి జూన్ 7న సంచారం చేయనున్నాడు. ఈ శని సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలను అందించబోతోందని జోతిష్యులు చెబుతున్నారు.