సురక్షిత జీవితం ప్రతి స్త్రీకి ప్రాథమిక హక్కు, కొన్ని దేశాలు ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని దేశాలలో, మహిళలు రాత్రి కూడా సురక్షితంగా ఒంటరిగా నడవవచ్చు. కనీసం అపాయం పొంచి ఉంటుందన్న భయం కూడా వీరిలో ఉండదు.
సురక్షిత ప్రదేశంలో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. ఈ దేశంలో మహిళల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు.
స్విట్జర్లాండ్ రెండవ స్థానంలో ఉంది. ఇది మహిళలకు చాలా సురక్షితమైన దేశం.
స్వీడన్‌లో మహిళలకు అనేక సామాజిక భద్రతా పథకాలు ఉన్నాయి. అందుకే అత్యంత భద్రత కలిగిన దేశాల్లో ఇది మూడో స్థానంలో ఉంది.
ప్రపంచంలో మహిళలకు అత్యంత భద్రత లభించే దేశాల్లో నార్వే 4వ స్థానంలో ఉంది. నార్వేలో మహిళలు ఉన్నత స్థాయి భద్రత, స్వాతంత్య్రాన్ని అనుభవిస్తారు.
ఈ జాబితాలో ఫిన్ లాండ్ 5వ స్థానంలో ఉంది. ఇక్కడ మహిళలకు పురుషులతో సమాన హక్కులు ఉన్నాయి.
Narender Vaitla