Grey Hair: ఇవి రోజూ తింటే... 40 దాటినా ఒక్క తెల్ల వెంట్రుక కూడా రాదు..!

Published : Oct 31, 2025, 12:13 PM IST

Grey Hair: తెల్ల జుట్టు వస్తోందని బాధపడుతున్నారా? మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడే ఈ సమస్య వస్తుంది.  కానీ, ఆ మెలనిన్ ఉత్పత్తిని పెంచుకోవడానికి కొన్ని రకాల ఆహారాలు  తీసుకుంటే సరిపోతుంది. 40 ఏళ్లు దాటినా కూడా తెల్ల వెంట్రుకలు కనపడవు.

PREV
16
తెల్ల జుట్టుకు చెక్ పెట్టే ఆహారాలు

ఈ రోజుల్లో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నవారే. నిండా పాతికేళ్లు కూడా రాకముందే... వైట్ హెయిర్ వచ్చేస్తోందని.. వయసు మళ్లిన వారిలా కనపడుతున్నామని చాలా మంది ఫీలౌతున్నారు. ఇలా జరగడానికి పోషకాల లోపమే కారణం. మన జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్ (Melanin) అనే వర్ణద్రవ్యం సరిపడేంత ఉత్పత్తి కాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మెలనిన్ ఉత్పత్తిని పెంచుకోవడానికి, కొన్ని పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది. మరి, ఎలాంటి ఆహారాలు తీసుకుంటే.. తెల్ల జుట్టు సమస్య తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం....

26
తెల్ల జుట్టుకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్...

1.విటమిన్ బి12 ...

విటమిన్ బి12 ఉండే ఆహారాలు తీసుకుంటే తెల్ల జుట్టు సమస్య ఉండదు. ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మెలనిన్ మంచిగా ఉత్పత్తి అవుతుంది. ఇది జుట్టు కుదళ్లు బలంగా మారతాయి. విటమిన్ బి12 లేకపోతే... జుట్టు దెబ్బ తింటుంది. చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వస్తుంది. అదే విటమిన్ బి12 తీసుకుంటే.. ఈ సమస్య ఉండదు. జుట్టు అందంగా మారుతుంది.

విటమిన్ బి12 ఉండే ఆహారాలు..

కోడి కాలేయం (Chicken liver)

సార్డిన్ చేపలు (Sardines)

గుడ్లు

పాలు, పెరుగు

పన్నీర్

ఈ ఆహారాలను వారానికి 3–4 సార్లు తీసుకోవడం మెలనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

36
2. రాగి (Copper) అధికంగా ఉన్న ఆహారాలు

రాగి టైరోసినేస్ (Tyrosinase) అనే ఎంజైమ్‌ను చురుకుగా ఉంచుతుంది, ఇది మెలనిన్ తయారీలో కీలకం. రాగి లోపం ఉంటే, జుట్టు తన సహజ వర్ణాన్ని కోల్పోతుంది. తెల్ల జుట్టు సమస్య పెరుగుతుంది.

రాగి పుష్కలంగా ఉండే ఆహారాలు..

బంగాళాదుంపలు

పుట్టగొడుగులు (Mushrooms)

బాదం, జీడిపప్పు

గొర్రె కాలేయం

తృణధాన్యాలు (Millets)

రోజుకు కనీసం 0.9 mg రాగి లభించేలా ఆహారం తీసుకోవడం మేలు.

46
3. ఐరన్ (Iron) అధికంగా ఉన్న ఆహారాలు

ఐరన్ కేవలం రక్తానికి మాత్రమే కాదు, జుట్టుకు కూడా ప్రాణం లాంటిది. ఇది మెలనిన్ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను చురుకుగా ఉంచుతుంది. ఐరన్ లోపం ఉంటే జుట్టు నిస్తేజంగా మారి, ముందుగానే తెల్లగా మారుతుంది.

తినదగిన ఆహారాలు:

పాలకూర, గోంగూర, బీట్రూట్

శనగలు, పప్పులు

కోడి మాంసం

నువ్వులు

ఖర్జూరం, ఎండు ద్రాక్ష

ఐరన్ తో పాటు విటమిన్ C ఉన్న ఆహారాలను కూడా తీసుకోవడం శోషణను పెంచుతుంది.

56
4. విటమిన్ D అధికంగా ఉన్న ఆహారాలు

విటమిన్ D కేవలం ఎముకలకే కాదు, జుట్టు పెరుగుదల, మెలనోసైట్ కణాల పనితీరుకి కూడా అవసరం. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టుకు అవసరం అయ్యే వర్ణాలు విడుదల అవుతాయి.

తినదగిన ఆహారాలు:

సాల్మన్ చేపలు (Salmon)

సార్డిన్స్

విటమిన్ D-ఫోర్టిఫైడ్ పాలు, నారింజ రసం

గుడ్ల పచ్చసొన

ఉదయపు సూర్యకిరణాలు (5–10 నిమిషాలు ప్రతిరోజు)

66
5. ఫోలేట్ (Vitamin B9) అధికంగా ఉన్న ఆహారాలు

ఫోలేట్ జుట్టు కుదుళ్లలో కణాల పెరుగుదల, వర్ణద్రవ్యం ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఇది కొత్త కణాల నిర్మాణానికి అవసరమైన DNA సంశ్లేషణలో కూడా భాగం.

తినదగిన ఆహారాలు:

ఆకుకూరలు (Spinach, Lettuce, Amaranth)

శనగలు, పెసరపప్పు

పప్పులు

బీన్స్, చిక్కుళ్లు

ఫైనల్ గా...

ఈ 5 పోషకాలతో నిండిన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే, మెలనిన్ ఉత్పత్తి సహజ స్థాయిలో కొనసాగుతుంది. జుట్టు ముందుగానే తెల్లగా రావడం ఆలస్యం అవుతుంది. ఇవి మీ జుట్టు ఆరోగ్యానికే కాదు, మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories