Face Glow: కలబంద లో ఇదొక్కటి కలిపి రాసినా... యవ్వనంగా కనిపిస్తారు..!

Published : Oct 30, 2025, 02:11 PM IST

Face Glow: కలబంద మనకు చాలా సహజంగా లభిస్తుంది. ఇదే కలబందతో ముఖం మెరిసిపోయేలా చేసుకోవచ్చు. అయితే.... దాంట్లో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా చేర్చితే... ముఖం మృదువుగా మారుతుంది. 

PREV
14
face glow

వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. దీని వల్ల వయసు మళ్లిన వారిలా కనిపిస్తూ ఉంటారు. కానీ, చాలా మంది సెలబ్రెటీలు వారి ఏజ్ పెరిగినా కూడా ఆ ఛాయలు కొంచెం కూడా ముఖంపై కనిపించవు. పైగా ఇంకా యవ్వనంగా కనిపిస్తారు. అలా కనిపించాలి అంటే, ఖరీదైన క్రీములు, అంతకంటే ఖరీదైన ట్రీట్మెంట్లు మాత్రమే చేయించుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ, సహజంగా, పెద్దగా ఖర్చు లేకుండా కూడా అందాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....

24
కలబంద ఫేస్ క్రీమ్

తాజాగా లభించే కలబందలో కుంకుమ పువ్వు రెమ్మలు కూడా చేర్చి ఒక మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా ముఖానికి రాస్తే చాలు. దీని వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ముఖంపై ఏవైనా నల్ల మచ్చలు ఉంటే.. అవి క్రమంగా తగ్గిపోతాయి. అంతేకాదు.. ఫేస్ మృదువుగా మారుతుంది. ఇది రెగ్యులర్ గా ముఖానికి రాస్తే.. మీకు స్పెషల్ గా మేకప్ లు రాయాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, సూర్యరశ్మ వలన ఏర్పడిన ట్యాన్ తగ్గిపోతుంది. మొటిమలు తగ్గుతాయి.

34
కుంకుమ పువ్వు...

ఇందులో కలబంద వాడతాం కాబట్టి.. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇక కుంకుమ పువ్వు... చర్మానికి బంగారం లాంటి మెరుపును అందిస్తుంది. వయసు రీత్యా వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. సహజంగా, మృదువుగా మారడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

44
క్రీమ్ రోజూ రాస్తే...

కలబంద జెల్‌లో విటమిన్ A, C, E, యాంటీ ఆక్సిడెంట్స్ , ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా తేమగా ఉంచి పొడిబారడాన్ని నివారిస్తాయి.ఇది చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. మొటిమలు, రాష్‌లు , సూర్యరశ్మి దెబ్బతిన్న చర్మాన్ని త్వరగా నయం చేస్తుంది. రోజూ రాస్తే..డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories