Jeans: అమ్మాయిలు రోజంతా జీన్స్ వేసుకుంటే ఏమౌతుంది?

Published : Oct 30, 2025, 05:05 PM IST

Jeans:  స్టైల్ గా,  ఫ్యాషన్ గా కనిపించడానికి టైట్ జీన్స్ వేసుకుంటున్నారా? కానీ, ఎక్కువ గంటలు ధరించడం వల్ల మీ హెల్త్ సమస్యల్లో పడుతుందని మీకు తెలుసా? ఊహించని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

PREV
14
Jeans

ఈ రోజుల్లో జీన్స్ వేసుకోని అమ్మాయిలు చాలా అరుదు అనే చెప్పొచ్చు. కాలేజీకి వెళ్లే అమ్మాయిల నుంచి ఆఫీసుకు వెళ్లే మహిళల వరకు అందరూ జీన్స్ ధరించడాన్ని ఇష్టపడతారు. అది చాలా కంఫర్ట్ ఫీల్ ఇస్తుంది. అంతేకాదు.. స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. అయితే... మహిళలు ఎక్కువ సేపు టైట్ జీన్స్ వేసుకొని ఉంటే, వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చ ని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...

24
రక్త ప్రవాహంలో ఆటంకం....

టైట్ జీన్స్ ధరించడం వల్ల కాళ్లు, గజ్జల ప్రాంతంలో రక్త ప్రసరణ పై ప్రభావం చూపుతుంది. ఇది కాళ్లల్లో తిమ్మిరి, వాపుకు కారణమౌతుంది. అలాంటి దుస్తులను ఎక్కువ సేపు ధరించడం వల్ల సిరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా, వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

చర్మ సమస్యలు....

టైట్ జీన్స్ ధరించడం వల్ల చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. గాలి కూడా సరిగా ఆడదు. చెమట, బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది చర్మానికి చికాకు కలిగిస్తుంది. దద్దర్లు,ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

34
తుంటి, వెన్నునొప్పి:

ఎక్కువసేపు టైట్ జీన్స్ ధరించడం వల్ల తుంటి, వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఇది కండరాలు, నరాలలో నొప్పిని కలిగిస్తుంది, ఇది చివరికి దీర్ఘకాలిక వెన్నునొప్పికి దారితీస్తుంది. ముఖ్యంగా ఎక్కువ గంటలు కూర్చొని ఉద్యోగాలు చేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

మూత్ర నాళం ఇన్ఫెక్షన్:

బిగుతు జీన్స్ ధరించడం వల్ల ఉదర ప్రాంతంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మూత్రాశయం, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అలాగే, మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరిగి UTIకి కారణమవుతుంది.

44
జీర్ణ సమస్యలు..

టైట్ జీన్స్ ధరించడం వల్ల మీ కడుపు , ప్రేగులపై ఒత్తిడి వస్తుంది. ఇది మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది తరచుగా గుండెల్లో మంట, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది.

జననేంద్రియ ఇన్ఫెక్షన్లు:

టైట్ జీన్స్ ధరించడం వల్ల మీ జననేంద్రియ ప్రాంతంలో వెంటిలేషన్ తగ్గుతుంది. ఇది చెమట, తేమను పెంచుతుంది, ఇది బాక్టీరియల్ ,ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. ఇది మహిళల్లో యోని ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ చికాకును కలిగిస్తుంది.

టైట్ జీన్స్ ధరించడం వల్ల తాత్కాలికంగా మీకు స్టైలిష్ లుక్ వస్తుంది. అయితే, ఎక్కువసేపు వాటిని ధరించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి, జీన్స్ కొనేటప్పుడు, టైట్ జీన్స్ కొనడానికి బదులుగా, వదులుగా ఉండే ప్యాంటు కొనండి. సౌకర్యవంతమైన, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది. మీరు అవసరమైనప్పుడు మాత్రమే టైట్ జీన్స్ ధరించవచ్చు, అది కూడా ఎక్కువసేపు ధరించకూడదు.

Read more Photos on
click me!

Recommended Stories