ఏం చేసినా బరువు తగ్గలేకపోతున్నారా? ఈ డ్రింక్స్ తాగి చూడండి..!

Published : Aug 18, 2025, 10:47 AM IST

జిమ్ లో వర్కౌట్స్ చేసినా , తిండి తినడం మానేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదా? అయితే కేవలం కేవలం కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మీరు చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.

PREV
14
Weight loss drink

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? దాని కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారా? ఏం చేసినా కూడా బరువులో మాత్రం తేడా కనిపించడం లేదా? జిమ్ లో వర్కౌట్స్ చేసినా , తిండి తినడం మానేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదా? అయితే కేవలం కేవలం కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మీరు చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. మరి, ఆ డ్రింక్స్ ఏంటో చూద్దామా...

24
బరువు తగ్గడానికి సహాయం చేసే అద్భుత పానీయాలు...

1.గ్రీన్ టీ...

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ టీ ఒక అద్భుతమైన పానీయం. ప్రతిరోజూ పరగడుపున ఖాళీ కడుపుతో ఈ గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తాగడం వల్ల.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా కరిగించొచ్చు. ఇది జీవక్రియను నియంత్రిస్తుంది. అదేవిధంగా జీర్ణ శక్తి మెరుగుపడటానికి కూడా సహాయపడుతుంది.

34
2.అల్లం , నిమ్మకాయ పానీయం:

మహిళలు తమ శరీరాకృతి చాలా అందంగా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా తమ నడుము చాలా సన్నగా ఉండాలని భావిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అది సాధ్యం కాకపోవచ్చు. అయితే.. మళ్లీ మీ నడుము సన్నగా మార్చుకునే అద్భుతమైన పానీయం ఉంది. అదే అల్లం, నిమ్మకాయ పానీయం. అల్లం రసం, నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయాన్నే తాగితే సరిపోతుంది. ఇలా రోజూ తాగితే చాలా సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంది.

3.బ్లాక్ కాఫీ...

మీకు నార్మల్ గా కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే.. పాలతో చేసే కాఫీ కి బదులు.. బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తాయి.

44
4.మెంతుల నీరు:

బరువు తగ్గాలి అనుకునే మహిళలు.. రోజూ మెంతుల నీరు తాగాలి. ఒక గ్లాసు నీటిలో రాత్రంతా 4 టీ స్పూన్ల మెంతులు నానపెట్టి, ప్రతిరోజూ ఆ నీటిని తాగాలి. వీలైతే ఆ మెంతులను కూడా తినేయాలి. ఇలా చేయడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగించడానికి, శరీర బరువు తగ్గించడానికి సహాయపడతాయి.

5.దాల్చిన చెక్క, తేనె:

ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గాలనుకునే మహిళలు కనీసం వారానికి ఒకసారి దాల్చిన చెక్క పొడి , తేనె కలిపిన నీటిని తాగాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తాయి.

మీరు ఖచ్చితంగా అలాంటి పానీయాలను ప్రతిరోజూ లేదా కనీసం వారానికి ఒకసారి తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే.. కేవలం ఈ పానీయాలు తాగడం మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. అప్పుడే బరువు తగ్గడం సాధ్యం అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories