ఈ నీళ్లను పెడితే.. మీ ముఖంపై ఒక్క మచ్చ కూడా ఉండదు

Published : Aug 17, 2025, 04:35 PM IST

ముఖంపై మచ్చలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి బియ్యం నీరు వరంలాంటిదనే చెప్పాలి. అవును బియ్యం నీళ్లను ఉపయోగించి ముఖంపై ఒక్క మచ్చ కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే? 

PREV
14
rice water

మొటిమలు, ముఖంపై మచ్చలు, సన్ ట్యాన్ వంటి సమస్యలు ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి. దీనికి అసలు కారణం మన లైఫ్ స్టైలేనంటారు నిపుణులు. పనిలో పడి చాలా మంది ముఖ సంరక్షణ గురించి అస్సలు పట్టించుకోరు. దీనివల్లే ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. మొటిమలు అవుతాయి. ఈ మచ్చలు పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా అవేవీ పనిచేయవు. కానీ రూపాయి ఖర్చు లేకుండా మీరు ముఖంమీదున్న మచ్చలను సులువుగా తగ్గించుకోవచ్చు. ఇవి మీ ముఖాన్ని అందంగా, కాంతివంతంగా కూడా చేస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
బియ్యం నీటిలోని ప్రత్యేకతలు

బియ్యం నీళ్లు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ఈ వాటర్ లో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో ఫెరులిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, స్టార్చ్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. 

ఇవన్నీ మీ స్కిన్ కలర్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి మచ్చలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. =

34
బియ్యం నీళ్లు ముఖ మచ్చలను తగ్గిస్తుందా?

అయితే బియ్యం నీళ్లలో ఉండే లక్షణాలు స్కిన్ రంగును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అందుకే దీనిని ముఖానికి అప్లై చేయాలని నిపుణులు సలహానిస్తారు. మీరు బియ్యం నీళ్లను ముఖ మచ్చలకు పెడితే అవి కొంతవరకు తగ్గుతాయి. 

అలాగే మీ చర్మానికి చల్లదనాన్ని కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీరు గనుక దీన్ని రోజూ లేదా వారానికి ఒకటి రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ చర్మాన్ని సాఫ్ట్ గా కూడా చేస్తుంది.

44
బియ్యం నీళ్లను ఎలా ఉపయోగించాలి?

ముఖంమీదున్న ముచ్చలు పోవడానికి మీరు బియ్యం నీళ్లను ఉపయోగించాల్సి వస్తే దానిలో కొంచెం రోజ్ వాటర్ ను లేదా కలబంద గుజ్జును కలపండి. అప్పుడు మీ ముఖానికి ఉపయోగించండి.

 ఇలా చేయడం వల్ల ముఖంమీదున్న మచ్చలు సులువుగా పోతాయి. ఈ విధంగా మీరు బియ్యం నీళ్లను మీ ముఖానికి ఉపయోగించొచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల మీ ముఖంపై మచ్చలు చాలా వరకు తగ్గుతాయి. 

అలాగే మీ ముఖం మరింత కాంతివంతంగా తయారవుతుంది. కానీ ఈ చిట్కాను ప్రయత్నించే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోవడం మంచిది. అలాగే ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories