జుట్టుకు గుడ్లు, పెరుగు ప్రయోజనాలు
గుడ్లలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, ప్రోటీన్లు, బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టును బలంగా చేస్తాయి. అలాగే వెంట్రుకలు తెగిపోవడం, రాలిపోవడం చాలా వరకు తగ్గుతుంది. ఇకపోతే గుడ్డు పచ్చసొన మన జుట్టుకు నేచురల్ షైనింగ్ ను ఇస్తుంది. అలాగే డ్రై హెయిర్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే పెరుగులో లాక్టిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది జుట్టుకు పట్టిన మురికిని తొలగిస్తుంది. చనిపోయిన కణాలను తొలగిస్తుంది. జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది. ఇకపోతే పెరుగును వాడటం వల్ల నెత్తిమీద పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది. నెత్తిమీద దురద, చుండ్రు సమస్యలు తగ్గుతాయి.