
నెయ్యిని మనం ఎన్నో సంవత్సరాలుగా ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. ఆయుర్వేదం ప్రకారం కూడా నెయ్యితో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం సంగతి పక్కన పెడితే.. ఇదే నెయ్యి.. మీ అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా? చాలా మంది అందాన్ని పెంచుకోవడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవడానికి వేలకు వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ.. రోజూ ఒక స్పూన్ నెయ్యి వాడితే చాలు మీ అందం రెట్టింపు అవ్వడానికి. మరి.. నెయ్యిని ఎలా తీసుకుంటే.. మీ వయసు పదేళ్లు తగ్గి.. అందంగా కనిపిస్తారో తెలుసుకోవాలని ఉందా.? ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి...
నెయ్యి...చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది. నెయ్యి తీసుకోవడం వల్ల చర్మంపై తేమగా ఉంటుంది. దాని వల్ల తెలీకుండానే ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలోనూ సహాయపడుతుంది. సహజంగా క్లెన్సర్ లా పని చేస్తుంది. ఇది చర్మ రంగును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖంపై ముడతలు రాకుండా, యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. చాలా మంది నెయ్యి తింటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది అనుకుంటారు. కానీ.. మితంగా తీసుకుంటే ఇదే నెయ్యి అందాన్ని పెంచుతుంది.
నెయ్యిని ఎలా తీసుకోవాలో తెలుసా?
నెయ్యి తింటే మంచిది అన్నారు కదా అని.. రోజూ మీరు తినే ఆహారంలో నెయ్యి వేసుకోవడం కాదు. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగాలి. అది కూడా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఈ నెయ్యి కలిపిన నీళ్లు తాగిన తర్వాత అరగంట పాటు.. మరేమీ తినకుండా ఉండాలి. కావాలి అనుకుంటే.. ఈ నీటిలో ఒక టీ స్పూన్ ఆర్గానిక్ పసుపును కూడా జోడించాలి. దీని వల్ల మరింత ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయి.
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ఆవు నెయ్యి తీసుకుంటే మరింత ఎక్కువ మేలు జరుగుతుంది. కేవలం ముఖంలో సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఏ, ఈ, డి పుష్కలంగా ఉంటాయి. ఈ మూడు చర్మానికి అనుకూలమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, చర్మాన్ని యవ్వనంగా మార్చడానికి సహాయపడాయి. వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి కూడా రాకుండా కాపాడుతుంది. 40 ఏళ్లు దాటిన వారు కూడా పదేళ్లు వయసు తగ్గి 30 ఏళ్లలా కనిపిస్తారు.చర్మ రంగు మెరుగుపడుతుంది. ముఖంపై నల్లమచ్చలు కూడా రాకుండా కాపాడుతుంది.
నెయ్యి జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఇది క్రమం తప్పకుండా ప్రేగు కదలికలకు సహాయపడుతుంది, ఫలితంగా శరీరం నుండి పేరుకుపోయిన విషాన్ని తొలగిస్తుంది.చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖంపై ఫైన్ లైన్స్, ముడతలు, కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. నెయ్యి తినడమే కాదు.. ముఖానికి మసాజ్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. రెగ్యులర్ గా నెయ్యితో ముఖానికి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడం, దద్దుర్లు, అలెర్జీ వంటి సమస్యలు రావు.
మీరు కావాలి అంటే... ఉదయం పూట మీరు తాగే టీ, కాఫీల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది మంచి ఎనర్జిటిక్ డ్రింక్ అవుతుంది. ఈ పానీయం మీ ఆకలిని నియంత్రిస్తుంది. మీరు అదనంగా కేలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన చర్మానికి, ఆరోగ్యకరమైన మనస్సుకు దారితీస్తుంది. ఆహారంలో ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే.. రోగనిరోధక శక్తి కూడా బలంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.