Grey Hair: ఇది రాస్తే.. ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు.. సెలబ్రిటీ సీక్రెట్

Published : Aug 13, 2025, 10:37 AM IST

మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ పూసేస్తూ ఉంటారు. వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే.. సహజంగా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ప్రయత్నించవచ్చు.

PREV
14
సెలబ్రిటీ చెప్పిన చిట్కా..

నల్లగా నిగనిగలాడే జుట్టు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వయసు పెరుగుతుంటే మనకు తెల్ల వెంట్రుకలు రావడం మొదలౌతూ ఉంటాయి. ఇక వాటిని కవర్ చేసుకోవడానికి ఎవరి తిప్పలు వారు పడుతూ ఉంటారు. ఎక్కువగా.. మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ పూసేస్తూ ఉంటారు. వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే.. సహజంగా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ప్రయత్నించవచ్చు. ఓ టీవీ ప్రముఖ హాస్య నటి భారతీ సింగ్ ఓ సీక్రెట్ ని చెప్పారు. తన చిన్నప్పటి నుంచి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు ఈ పద్దతిని ఉపయోగిస్తూ వస్తున్నాను అని చెప్పారు. దాని వల్ల ఇప్పటికీ తన జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటుందని ఆమె చెప్పారు. నల్లగా మారడమే కాదు, జుట్టు రాలే సమస్య కూడా ఉండదు. మరి, ఆ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా...

24
ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోవడానికి కావాల్సినవి...

హెన్నా పౌడర్- 4,5 టీ స్పూన్లు( మీ జుట్టు ఎక్కువగా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు)

కలబంద జెల్ -2 టేబుల్ స్పూన్లు( మీ జుట్టును తేమగా ఉంచడానికి)

గుడ్డు తెల్ల సొన-1( జుట్టును నునుపుగా,మెరిసేలా చేయడానికి)

టీ డికాషిన్ నీరు-1 కప్పు(జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి)

ఐరన్ పాన్- రంగును కలపడానికి ఇది మాత్రమే వాడాలి.

ఇక.. ఈ కలర్ డై తయారు చేసే విధానం...

ముందుగా మీ ఇంట్లో ఉన్న పాత ఐరన్ ప్యాన్ తీసుకోవాలి. దానిని ముందుగా శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. ఆ తర్వాత దానిమీద హెన్నా పొడి, కలబంద జెల్, గుడ్డు తెల్ల సొన కూడా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత టీ డికాషిన్ కొద్ది కొద్దిగా వేస్తూ.. మంచిగా కలపాలి. మంచి పేస్టులాగా మార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా.. ఐరన్ ప్యాన్ మీద మాత్రమే ఉంచాలి. దానిపై మూత పెట్టడం మర్చిపోవద్దు.

34
జుట్టుకు హెన్నా ఎలా అప్లై చేయాలి...?

రాత్రంతా నానపెట్టి ఉంచిన హెన్నా మిశ్రమాన్ని.. ఉదయాన్నే తలకు అప్లై చేయాలి. జుట్టుకు అప్లై చేయడానికి ముందు.. తలలోని చిక్కులన్నీ పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత తల నుంచి.. కింద కుదుళ్ల వరకు మొత్తం మంచిగా అప్లై చేయాలి. రెండు గంటల పాటు అలానే వదిలేయాలి. రెండు గంటల తర్వాత జుట్టు మొత్తాన్ని నీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ కూడా సల్ఫేట్ లేనిది ఎంచుకోవాలి. అంతే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. రెగ్యులర్ గా వాడితే.. మరింత అందంగా మీ జుట్టు మారడం ఖాయం.

44
ఇంట్లో తయారుచేసిన డై వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

సహజమైన నల్ల రంగు - టీ ఆకులు , ఐరన్ ప్యాన్ కాంబినేషన్ జుట్టుకు మంచి రంగును ఇస్తాయి.

మృదువైన , మెరిసే జుట్టు - గుడ్డులోని తెల్లసొన , కలబంద జుట్టును సిల్కీగా చేస్తాయి.

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - హెన్నా జుట్టును బలంగా , చుండ్రు లేకుండా చేస్తుంది.

రసాయనాలు ఉండవు - పూర్తిగా సహజమైనవి.. ఎలాంటి రసాయనాలు ఉండవు.. కాబట్టి.. జుట్టుకు ఎలాంటి హాని జరగదు.

Read more Photos on
click me!

Recommended Stories