Face Glow: ఇది రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోతుంది..!

Published : Aug 13, 2025, 03:31 PM IST

ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో, చర్మం పొడిగా మారుతుంది. ముఖంలో మెరుపు కూడా తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ఇంట్లో తయారు చేసిన పసుపు ఫేషియల్ స్క్రైబ్ వాడితే చాలు

PREV
13
Face Glow

ఈ రోజుల్లో అందంగా కనపడటానికి చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు ముఖానికి పూసేస్తూ ఉంటారు. ఖరీదైన ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో అందాన్ని పెంచుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి.. అందరూ ఎవరి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ, పూర్వం మన అమ్మలు, అమ్మమ్మలకు ఇన్ని ఆప్షన్స్ ఏమీ ఉండేవి కావు. కానీ.. వారు అంతకంటే అందంగా కనిపించేవారు. చాలా యవ్వనంగా కూడా కనిపించేవారు. దాని వెనక ఉన్న సీక్రెట్ పసుపు మాత్రమే. ఇదే పసుపు వాడి.. సహజంగా మనం అందంగా మెరిసిపోవచ్చు. ఈ పసుపులో మరి కొన్నింటిని కలిపి ముఖానికి రాస్తే.. మీ ముఖం బంగారంలా మెరుస్తుంది. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

23
పసుపుతో మెరిసే అందం...

ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో, చర్మం పొడిగా మారుతుంది. ముఖంలో మెరుపు కూడా తగ్గుతుంది. ఈ సమస్యను పరిష్కరించడంలో ఇంట్లో తయారు చేసిన పసుపు ఫేషియల్ స్క్రైబ్ వాడితే చాలు.. ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంది. అయితే, వారానికి కనీసం మూడు సార్లు అయినా ఈ పసుపు ప్యాక్ ని ముఖానికి వాడాల్సిందే. ఈ పసుపులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లమేటరీ ప్రాపర్టీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై మురికిని తొలగించడంతో పాటు... ఫేస్ ని తాజాగా ఉంచుతాయి.

పసుపు ఫేస్ స్క్రబ్ తయారీకి కావాల్సిన పదార్థాలు...

కస్తూరి పసుపు- 3 టేబుల్ స్పూన్లు, శెనగ పిండి-5 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి కొద్దిగా, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు కొద్దిగా.. ఇవి ఉంటే చాలు. వీటితో అందాన్ని పెంచుకోవచ్చు.

33
పసుపు స్క్రబ్ ని ఎలా తయారు చేయాలి..?

చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి మనం ఈ పసుపు స్క్రబ్ వాడితే చాలు. ముందుగా ఒక చిన్న గిన్నెలో పసుపు, శనగ పిండి వేసి బాగా కలపాలి. దీనిలోనే కొద్దిగా బియ్యం పిండి, కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపాలి. దీనిని మీరు ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.

ముందుగా... నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో పెరుగు లేదా పాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. తర్వాత, మీ ముఖాన్ని మీ చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి. చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా చేస్తున్నప్పుడు, పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మంపై చర్మ ఇన్ఫెక్షన్ల ప్రభావాలను తగ్గిస్తాయి. అదనంగా, ఈ స్క్రబ్‌లో కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు, బ్లాక్‌హెడ్స్ ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. కనీసం రెండు, మూడు నెలలు అయినా దీనిని ముఖానికి రాస్తే.. మీ అందం రెట్టింపు అవుతుంది. బంగారంలా మెరుస్తూ కనపడుతుంది. ముఖంపై ముడతలు లేకుండా.. యవ్వనంగా కనిపిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories