Summer Hair Care Tips: ఎండాకాలంలో వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలా చేయాలి?

Published : Apr 22, 2026, 03:29 PM IST

ఎండాకాలంలో మన లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వస్తాయి. ఉష్ణోగ్రత, చెమట, కాలుష్యం వంటివి మన జుట్టు ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. మరి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం. 

PREV
15
Summer Hair Care Tips

ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమట, దుమ్ము, ధూళి, కాలుష్యం వంటివి తల చర్మంపై ప్రభావం చూపి జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి సరైన టైంకి సరైన పద్ధతిలో తలస్నానం చేయడం ముఖ్యం. నిపుణుల ప్రకారం.. ఎండాకాలంలో వారానికి 2 నుంచి 3 సార్లు తలస్నానం చేయడం మంచిది. అయితే ఇది మన జీవనశైలి, స్కాల్ప్ స్వభావం, జుట్టు రకాన్ని బట్టి మారుతుంది. 

25
సమతుల్యత అవసరం

ఎండాకాలంలో చెమట ఎక్కువగా రావడం వల్ల తల చర్మంపై ఆయిల్, డస్ట్ పేరుకుపోతాయి. దీనివల్ల డాండ్రఫ్, ఇర్రిటేషన్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తరచూ తలస్నానం చేయడం ద్వారా ఈ మలినాలను తొలగించడం అవసరం. అయితే రోజూ తలస్నానం చేయడం కూడా మంచిది కాదు. ఎక్కువసార్లు షాంపూ వాడితే తలలోని సహజ తేమ తగ్గిపోతుంది. దాంతో జుట్టు మరింత డ్రైగా, రఫ్‌గా మారుతుంది. కాబట్టి సమతుల్యత అవసరం.

35
జుట్టు రకాన్ని బట్టి తలస్నానం

జుట్టు రకాన్ని బట్టి తలస్నానం ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారికి చెమటతో పాటు ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి, వారానికి 3 సార్లు తలస్నానం చేయవచ్చు. డ్రై స్కాల్ప్ ఉన్నవారు వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఎక్కువసార్లు చేస్తే జుట్టు మరింత పొడిబారే ప్రమాదం ఉంటుంది. కర్లీ లేదా రఫ్ హెయిర్ ఉన్నవారు తక్కువసార్లు తలస్నానం చేయడం మంచిది. ఎందుకంటే వారి జుట్టు సహజంగానే డ్రైగా ఉంటుంది.

45
తలస్నానం చేసే విధానం

ఎండాకాలంలో చల్లటి లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిది. వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు మరింత డ్రై అవుతుంది. అలాగే మైల్డ్ షాంపూ వాడటం ఉత్తమం. అది తల చర్మానికి హాని చేయకుండా శుభ్రం చేస్తుంది. షాంపూ తర్వాత కండిషనర్ వాడటం వల్ల జుట్టు మృదువుగా, తేమగా ఉంటుంది. వారానికి ఒకసారి నేచురల్ హెయిర్ మాస్క్ లేదా ఆయిల్ మసాజ్ చేయడం ద్వారా జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.

55
అవసరాన్ని బట్టి...

ఎండాకాలంలో బయటికి ఎక్కువగా వెళ్లే వారు, వ్యాయామం చేసే వారు, లేదా ఎక్కువగా చెమట పట్టే వారు అవసరాన్ని బట్టి తలస్నానం సంఖ్యను పెంచుకోవచ్చు. అయితే ప్రతిసారి షాంపూ వాడాల్సిన అవసరం లేదు, కొన్ని సార్లు కేవలం నీటితో కడిగినా సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories