మీరు కొబ్బరి నూనె , విటమిన్ ఇ ని మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండు పదార్థాల మిశ్రమాన్ని రాసుకోవడం వల్ల తేమ నిలిచి ఉండి, చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నూనె , విటమిన్ ఇ మిశ్రమాన్ని పూయడం వల్ల చర్మం పొడిబారడాన్ని తగ్గించి, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నూనె, విటమిన్ ఇ ఆయిల్ ముఖానికి ఎలా రాయాలంటే...
నిద్రపోయే ముందు, ఒక విటమిన్ ఇ క్యాప్సూల్‌ను తీసి కొబ్బరి నూనెలో కలపండి. దానిని బాగా కలపండి. ఈ నూనెను మీ ముఖానికి పూయండి. మీకు సాధారణ చర్మం ఉంటే, ఈ నూనెను వారానికి 1 నుండి 2 సార్లు రాయాలి. మీకు జిడ్డు చర్మం ఉంటే, వారానికి ఒకసారి మాత్రమే రాయాలి. మీకు పొడి చర్మం ఉంటే, వారానికి 3 నుండి 4 సార్లు వాడొచ్చు. ప్రతిరోజూ వాడటం మంచిది కాదు.
మొటిమలు ఉన్నవారు..
మీ ముఖం ఎక్కువగా జిడ్డుతో ఉన్నా.. లేదంటే.. ముఖంపై మొటిమలు ఉన్నా.. ఈ నూనెలు రాయకపోవడమే మంచిది. ఈ నూనెలు రాయడం వల్ల మీ ముఖంపై మొటిమలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.