జోతిష్య శాస్త్రం ప్రకారం.. జుట్టుకు చంద్రుడితో సంబంధం ఉంటుంది. జాతకంలో చంద్రుడు అశుభంగా ఉన్నా లేదా శని, కేతు గ్రహాల ప్రభావం ఉన్నా ఇటువంటి కలలు వస్తాయి. శని పూర్వీకుల కర్మలకు, కేతువు పితృ దోషానికి కారకులుగా పరిగణిస్తారు.
పితృ దోషం తొలగించుకోవడానికి పరిహారాలు...
ఇలాంటి కలలు పదే పదే వస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకుండా కొన్ని పరిహారాలు పాటించాలి..
తర్పణాలు శ్రాద్ధం: పూర్వీకుల ఆత్మశాంతి కోసం పూర్తి భక్తితో తర్పణాలు సమర్పించాలి. ముఖ్యంగా పూర్వీకులు మరణించిన తిథి నాడు లేదా పితృ పక్షం సమయంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి.
శివలింగానికి జలాభిషేకం: సోమవారం నాడు శివలింగానికి జలసమర్పణ చేయడం ద్వారా పితృ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది.
అన్నదానం: పేదలకు , బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నం అవుతారు.
శనివార నియమం: శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని-పితృ దోషాలు శాంతిస్తాయి.
మంత్ర జపం: చంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి సంబంధిత మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత, జీవితంలో స్థిరత్వం లభిస్తుంది.