Women Weight Loss Food: ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే భోజనం మానేయడం సరైన పద్ధతి కాదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మహిళలు తమ బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
బరువు తగ్గాలంటే భోజనం మానేస్తే సరిపోదు. అది ఎలా తినాలో, ఎప్పుడు తినాలో, ఏం తినాలో తెలుసుకోవాలి. అందులోనూ మహిళలు ఇంట్లో మిగిలిపోయింది కదా తినేస్తుంటారు. దానివల్ల తెలీయకుండానే ఎక్కువగా తినేస్తారు. అప్పుడు డైట్ గాడి తప్పుతుంది. బరువు తగ్గాలనుకుంటారు..కానీ ఇంటి పరిస్థితులు సహకరించవు. అందుకే ఒక్కోసారి పూర్తిగా తినకుండా ఉండిపోతారు. అది సరైన పద్ధతి కాదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మహిళలు తమ బరువును సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అవేంటో చూద్దాం.
చికెన్‌లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఆకలి తగ్గుతుంది. దాంతో బరువు కూడా అదుపులో ఉంటుంది.
26
చేపలు
చేపల్లో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని కంట్రోల్ చేయడమే కాకుండా, హార్మోన్ల పనితీరుకు కూడా సపోర్ట్ చేస్తాయి.
36
పప్పు దినుసులు
పప్పు దినుసుల్లో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తింటే ఎక్కువగా తినకుండా కంట్రోల్ చేస్తుంది.