Ugadi Beauty Tip: ఉగాది రోజు స్పెషల్ గా కనిపించాలా? ఇదొక్కటి ముఖానికి రాస్తే చాలు..

Published : Mar 12, 2026, 01:57 PM IST

Ugadi Beauty Tip: ఈ ఉగాది రోజు మీ అందంతో సెలబ్రేషన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ సింపుల్ ఫేస్ ప్యాక్‍తో ఫెస్టివల్ లుక్‍తో అందరి మనసు దోచేయండి. 

PREV
15
ఉగాది కొత్త ఆశలు, కొత్త ఉత్సాహానికి సంకేతం

ఉగాది అంటే కొత్త ఏడాదికి ఆరంభం మాత్రమే కాదు...కొత్త ఆశలు, కొత్త ఉత్సాహానికి, కొత్త జీవితానికి సంకేతం. ఈ ప్రత్యేకమైన రోజును ఆనందంగా ప్రారంభించాలి. మరి ఆనందంతో పాటు అందం కూడా ముఖ్యమే కదా. ఉగాది రోజు పూజలు, సెలబ్రేషన్స్ ఉంటాయి. సో అలాంటి సమయంలో మరింత అందంగా ఉంటే....అందరి చూపు మీ మీదే ఉంటుంది. చాలా మంది బ్యూటీఫుల్‍గా కనిపించాలని బ్యూటీ టిప్స్ ట్రై చేస్తుంటారు. పార్లర్స్ అని, ఫేస్ ప్యాక్‍లని, వగైరా వగైరా ప్రయత్నిస్తుంటారు. అయితా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే పార్లర్ గ్లోతో పాటు అందరి కన్నా మీరే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారు.

25
పసుపు, పెరుగు ప్యాక్ చాలా మంచి రిజల్ట్

ఉగాది రోజు ముఖం ప్రత్యేకంగా నిగనిగలాడాలంటే పసుపు, పెరుగు ప్యాక్ చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. ఇది చర్మానికి సహజ కాంతితో పాటు చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది. అంతేకాకుండా పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు చర్మాన్ని లోపల నుంచి క్లీన్ చేస్తుంది. ప్యాక్‍లో ఉండే పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది.

35
ఈ ప్యాక్ తయారీ చాలా ఈజీ

ఈ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా పెరుగు తీసుకుని అందులో చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. అవసరమైతే అందులో అరచెంచా హనీ కూడా యాడ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి సుమారు 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.

45
మేకప్ ఈవెన్‍గా సెట్ అవుతుంది

పసుపు, పెరుగు ప్యాక్‍తో స్కిన్‍పై ఉన్న మురికి, మృతకణాలు తొలగిపోతాయి. ముఖం ప్రెష్‍టోన్‍తో పాటు గ్లోయింగ్‍గా కనిపిస్తుంది. ముఖ్యంగా పండుగ రోజు మేకప్ వేసుకునే ముందు ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం బ్రైట్‍గా, సాఫ్ట్ గా కనిపించడంతో పాటు మేకప్ ఈవెన్‍గా సెట్ అవుతుంది.

55
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే...

అంత కన్నా ముందు ఉదయం లేచిన వెంటనే చక్కగా స్నానం చేసేయాలి. ఆ తర్వాత రోజ్ వాటర్‍తో ముఖాన్ని తుడుచుకుంటే ఫ్రెష్‍గా ఉంటుంది. రోజంతా నీళ్లు తాగడం కూడా చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే...నూనె పదార్థాలు తినకపోవడం బెటర్. ఫ్రూట్స్, తేలికపాటి ఆహారం, ముందురోజు సరైన నిద్ర చాలా అవసరం. ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ లేకుండానే సహజ పదార్థాలతో మీ ముఖం మెరిసిపోతుంది. ఈ ఉగాదికి మీ అందంతో అందరిని ఆకర్షిస్తారు. మరి ట్రై చేసేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories