Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది

Published : Mar 12, 2026, 07:51 PM IST

Manthena Hair Care Tip: జుట్టు రాలుతోందా?, ఎన్ని ప్రొడక్టులు వాడుతున్నా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నా హెయిర్ పెరగడం లేదా? అయితే మంతెన గారి ఈ చిట్కా పాటిస్తే హెల్దీ హెయిర్ మీ సొంతం. 

PREV
15
మంతెన గారి చిట్కా

ఆ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య జుట్టు రాలడం. అదొక్కటేనా...డాండ్రఫ్, పీచులాగా అయిపోవడం, చిగుర్లు చిట్లిపోవడం, సన్నగా అవ్వడం, పేన్లు...ఇవన్నీ సాధారణ ప్రాబ్లమ్స్ లా అనిపించినా...కానీ హెయిర్ విషయంలో సతమతమై లక్షలు ఖర్చు పెట్టేవాళ్లు ఉన్నారు. కానీ మంతెన సత్యన్నారాయణ గారి ఈ ఒక్క చిట్కా పాటిస్తే మాత్రం వద్దన్నా కూడా జుట్టు పెరుగుతూనే ఉంటుంది. మరి అదెంటో చూసేద్దామా? 

25
ఇవన్నీ శరీరంలో సమస్యలకు కారణాలే

ఇప్పుడున్న పొల్యుషన్, డైలీ లైఫ్, డైట్....వీటన్నిటి వల్ల కంటికి కనిపించని శరీరంలో సమస్యలకు కారణాలే. చిన్న వయస్సులోనే జుట్టు పల్చబడటం, ఎక్కువగా రాలిపోవడం వంటివి ఎదుర్కుంటున్నారు. మెయిన్ రీజన్...ఆహారపు అలవాట్లు, ప్రెజర్, సరైన నిద్ర లేకపోవడం, పోషకాల లోపమే అని చెబుతున్నారు. కొన్ని సహాజపద్ధతులు పాటిస్తే జుట్టు రాలేసమస్యను తగ్గించవచ్చు.

35
ఖాళీ కడుపుతో సాత్విక ఆహారం తీసుకోవాలి

మంతెన గారు చెప్పినట్లు జుట్టు ఆరోగ్యమనేది కేవలం బయటపెట్టే నూనెలు, షాంపూలపై మాత్రమే ఆధారపడదు. శరీరానికి సరైన పోషకాలు అందితేనే జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరుగుతుంది. అందుకే ఉదయం ఖాళీ కడుపుతో సాత్విక ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఫ్రెష్ ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, ఆకుకూరలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. దాంతో రక్తప్రసరణ సరిగ్గా జరిగ్గా జుట్టుకు పోషణ ఇస్తుంది. 

45
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి

అంతేకాకుండా రోజుకు తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం మాత్రమే కాదు జుట్టు కూడా పొడిగా మారుతుంది. దీంతో జుట్టు త్వరగా విరిగి రాలిపోవచ్చు. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్లు తాగితే శరీరం వ్యర్థాలు బయటకు పోయి జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. ఇంకో ముఖ్యమైన విషయం మార్నింగ్ వాకింగ్, తేలికపాటి వ్యాయామం చేయడం. దీనివల్ల బ్లడ్ సర్య్కూలేషన్ జరిగి జుట్టు వేర్లు బలపడతాయి. 

55
తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తినాలి

మంతెన గారు చెప్పొచ్చేదేంటంటే...ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్‍కు దూరంగా ఉండి తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎక్కువగా తినాలని చెబుతున్నారు. ఒత్తిడిని బయటపడాలని సూచిస్తన్నారు. మనసు ప్రశాంతంగా ఉంటే మెదడు ఫ్రెష్‍గా ఉండి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిసారి పార్లర్‍కు వెళ్లి వేలకు వేలు పోగొట్టుకోవడం కంటే సాత్విక ఆహారం, నీళ్లు, వ్యాయామం, నిద్ర ఉంటే చాలంట. చిన్న అలవాట్లు డైలీ లైఫ్‍లో భాగం చేసుకుంటే జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories