ఇలా చేస్తే వెల్లుల్లి రెబ్బలు నెలల తరబడి ఫ్రెష్ గా ఉంటాయి

Published : Sep 06, 2025, 05:00 PM IST

ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బలు వంటలనే టేస్టీగా చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ప్రతి కూరలో వేస్తుంటారు. అయితే ఈ వెల్లుల్లి రెబ్బలు వారంలోనే వాడిపోయి పాడైపోతుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో ఇవి నెలల తరబడి నిల్వ ఉంచొచ్చు. అదెలాగంటే? 

PREV
16
వెల్లుల్లి

మనం చేసే ప్రతి కూరలో వెల్లుల్లిని ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే ఇవి వంటలకు మంచి టేస్ట్ ను తెస్తుంది. అయితే ఎప్పుడో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా.. ఫ్రెష్ వెల్లుల్లి రెబ్బలను వంటల్లో వాడితే కూరలు మరింత టేస్ట్ అవుతాయి. అందుకే చాలా మంది వెల్లుల్లి రెబ్బలను కిలో రెండు కిలోలు కొనేసి ఇంట్లో నిల్వ చేస్తుంటారు. 

కానీ ఇవి కొన్ని రోజుల్లోనే వాడిపోయి, వాసన కోల్పోతాయి. అలాగే పాడైపోతుంటాయి. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే గనుక వీటిని వారాలు లేదా నెలల తరబడి నిల్వ ఉంచొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
ఇలాంటి వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి

వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనుకుంటే గనుక మీరు వీటిని కొనేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి . ముఖ్యంగా మీరు కొనే వెల్లుల్లి రెబ్బలు ఫ్రెష్ గా ఉండాలి. అలాగే వీటిపై ఏ మచ్చలు కూడా ఉండకూడదు. పట్టుకుంటే గట్టిగా ఉండాలి. మెత్తగా ఉండకూదు. ముఖ్యంగా మొలకలు వచ్చిన వెల్లుల్లి రెబ్బలను అస్సలు కొనకండి. మీరు కొనే వెల్లుల్లి ఎంత ఫ్రెష్ గా ఉంటే అవి మన ఇంట్లో అన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని ఫ్రిజ్ లో పెడితే వారాల పాటు నిల్వ ఉంటాయి.

36
ఇలా నిల్వ చేయండి

అయితే చాలా మంది వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసేసి నిల్వ చేస్తుంటారు. కానీ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు తొందరగా వాడిపోయి పాడైపోతుంటాయి. వీటిని మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే గాలి వెల్లని డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టండి. సిరామిక్ కంటైనర్లు ఇందుకోసం ఉపయోగపడతాయి. వీటివల్ల వెల్లుల్లి రుచి మారదు. వాసన కూడా మారదు. అయితే ఈ వెల్లుల్లి రెబ్బలకు కొంచెం ఆలివ్ అయిల్ ను రాస్తే ఇవి తాజాగా ఉంటాయి.

46
ఫ్రిజ్ లో వీటిని మాత్రమే పెట్టండి

వెల్లుల్లిని ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటాయి. కానీ చల్లని ఉష్ణోగ్రతలో వెల్లుల్లి రెబ్బలను పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల అవి మొలకెత్తుతాయి. అందుకే పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను ఫ్రిజ్ లో పెట్టకండి. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను, తరిగిన వెల్లుల్లిని మాత్రమే పెట్టండి. అదికూడా గాలి వెల్లని డబ్బాలో పెట్టాలి.

56
ఇలా అయితే కుళ్లిపోతాయి

ఫ్రిజ్ లో కాకుండా బయట వెల్లుల్లి రెబ్బలను నిల్వ చేయాలనుకుంటే మాత్రం వెలుతురు, గాలి, పొడిగా ఉండే ప్రదేశాల్లోనే పెట్టాలి. తేమ ఎక్కువగా ఉంటే వెల్లుల్లి తొందరగా కుల్లిపోతాయి. అందుకే తేమ లేని చోటే వెల్లుల్లిని పెట్టాలి.అలాగే వేడి వల్ల కూడా వెల్లుల్లి తొందరగా పాడైపోతాయి. అందుకే సింక్ దగ్గర, పొయ్యి దగ్గర వెల్లుల్లి రెబ్బలను పెట్టకండి. అలాగే ఎండ ఉండే ప్రదేశాల్లో కూడా వెల్లుల్లిని పెట్టకండి. దీనివల్ల అవి మొలకెత్తుతాయి. మెత్తబడతాయి.

66
చెక్ చేయండి

వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండాలి. ఏవైనా పాడైనవి, మచ్చలొచ్చినవి ఉంటే వాటిని తీసేయాలి. వీటివల్ల వేరే వెల్లుల్లి రెబ్బలు కూడా పాడైపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories