కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల చర్మం దెబ్బతింటుంది. అయితే చాలా మంది అందంగా కనిపించాలని కాస్ట్లీ కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ కొన్ని అలవాట్లతో మీరు మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు తెలుసా?
అమ్మాయిలు మేకప్ వేసుకుంటేనే అందంగా కనిపిస్తారని అనుకుంటారు. కానీ అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోనక్కర్లేదు. కొన్ని అలవాట్లుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవును మీరు అందంగా కనిపించడానికి కొన్ని అలవాట్లు బాగా సహాయపడతాయి. వీటిని గనుక ఫాలో అయితే మీరు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడక్కర్లేదు. అలాగే స్కిన్ కేర్ రొటీన్స్ కూడా అవసరం లేదు. మరి చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
26
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచాలి
చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే ఖచ్చితంగా స్కిన్ ను హైడ్రేట్ గా ఉంచాలి. ఇందుకోసం రోజంతా నీళ్లను పుష్కలంగా తాగాలి. ఇది మన స్కిన్ ను హైడ్రేట్ చేస్తుంది. అలాగే ప్రతిరోజూ మాయిశ్చరైజర్ ను కూడా చర్మానికి అప్లై చేయాలి.
నీళ్లనే కాకుండా మీరు నారింజ, వాటర్ మిలన్, కీరదోసకాయ వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్లను కూడా తినొచ్చు. ఇవి కూడా మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి. మన శరీరం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంటే మనం బయటి నుంచి అందంగా కనిపిస్తాం.
36
క్లీనింగ్ ముఖ్యం
రోజూ బయట తిరిగినా, ఇంట్లోనే ఉన్నా ముఖానికి దుమ్ము, ధూళి, నూనె అంటుకుంటాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా తొలగించాలి. అలాగని ముఖాన్ని ఎప్పూడు క్లెన్సర్ తో కడిగితే మీ చర్మం దెబ్బతింటుంది. వీటివల్ల ముఖంలోని సహజ తొలగిపోతుంది. దీంతో మీ ముఖం డ్రైగా అవుతుంది.
అలాగే మరింత సున్నితంగా అవుతుంది. అందుకే మీరు ముఖాన్ని శుభ్రం చేయడానికి సల్ఫేట్ ఫ్రీ, పీహెచ్ బ్యాలెన్స్ డ్ క్లెన్సర్లనే వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే ముఖాన్ని రోజుకు రెండు సార్లకంటే ఎక్కువ కగడకూడదు. అలాగే సబ్బును ఎక్కువగా పెట్టకూడదు.
సన్ స్క్రీన్ ను ఒక్క ఎండాకాలంలోనే పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ దీన్ని అన్ని కాలాల్లో చర్మానికి పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల పిగ్మెంటేషన్, మచ్చలు అవుతాయి. అంతేకాదు ఎండ వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే రోజూ సన్ స్క్రీన్ ను అప్లై చేసుకోవాలి. అయితే మీ ముఖం రోజంతా ఫ్రెష్ గా కనిపించాలంటే నూనె లేని సన్ స్క్రీన్ ను పెట్టాలి.
56
మాయిశ్చరైజర్
ఆయిలీ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజర్ ను అప్లై చేయకూడదని అనుకుంటారు. కానీ ఆయిలీ స్కిన్ ఉన్నవారు కూడా మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. అయితే జెల్ లా ఉండే మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మంచిది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
66
బాగా నిద్రపోవాలి
నిద్ర కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మం అందంగా ఉండటానికి కూడా అవసరం. మనం ప్రశాంతంగా నిద్రపోతే మన చర్మం అంత హెల్తీగా ఉంటుంది. మనం రాత్రి పడుకున్నప్పుడు మన చర్మం తనకు తానే రిపేర్ చేసుకుంటుంది. మీరు ఒత్తిడికి గురైనా, సరిగ్గా నిద్రపోకపోయినా మీ చర్మం డల్ గా కనిపిస్తుంది.
ప్రతిరోజూ రాత్రి ఏడెనిమిది గంటల నిద్రపోతే మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. అయితే దిండు అలవాటు ఉంటే గనుక సిల్క్ కవర్ వేసిన దిండును ఉపయోగించడం మంచిది. ఇది మీ చర్మాన్ని డ్యామేజ్ చేయదు.