ఒకప్పుడు అయితే పెళ్లి కాని అమ్మాయిలు జీన్స్, డ్రెస్సులనే ఎక్కువగా వేసుకునే వారు. కానీ ఇప్పుడు ప్రతి చిన్న ఫంక్షన్ కు, పండగకి చీరలనే ధరిస్తున్నారు. మరి ఈ చీరలు కూల్ గా, స్టైలిష్ గా కనిపించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ రోజుల్లో అమ్మాయిలను చీరలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఏ చిన్న ఫంక్షన్ కి అయినా సరే చీరనే కట్టుకెళ్తున్నారు. అయితే చీరలో అందంగా, స్టైలిష్ గా కనిపించాలంటే కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు కట్టుకున్న చీరకు అందం వస్తుంది. ఇందుకోసం ఏం టిప్స్ ను ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం..
26
పూల చీర
ఈ రోజుల్లో పూల చీరలు బలే ట్రెండ్ అవుతున్నాయి. హీరోయిన్ల నుంచి సాధారణ మహిళల వరకు ప్రతి ఒక్కరూ పూల చీరనే ఇష్టపడుతున్నారు. ఈ పూల చీరలు ప్రతి ఒక్కరికీ అందంగా ఉంటాయి. కాబట్టి మీరు పూల ప్రింట్లు, ప్యాటర్న్ లను ట్రై చేయండి. ఫ్లోరల్ పైథానీ చీరలో కూడా అందంగా కనిపిస్తారు. అలాగే ఈ మధ్య కాలంలో త్రీడీ ఫ్లోరల్ ఎఫెక్ట్, ఫ్లోరల్ నెట్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి డిజైన్ చీరలు మీ లుక్ ను వావ్ అనిపించేలా చేస్తాయి.
36
స్టైలిష్ బ్లౌజ్
చీర బాగుంటే సరిపోదు.. దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ కూడా బాగుండాలి. ఒకప్పటిలా సంప్రదాయ బ్లౌజులను ఇప్పుడు ఎవ్వరూ ధరించడం లేదు. స్లీవ్ లెస్, హాల్టర్ నె, ఫుల్ స్లీవ్స్ వంటి బ్లౌజులనే ఎక్కువగా ధరిస్తున్నారు. మీరు గనుక చీరకు హాల్టర్ నెక్ బ్లౌజ్ ను వేసుకుంటే మరింత స్టైలిష్ గా కనిపిస్తారు. టిష్యూ, షిఫాన్ వంటి చీరకు డీప్ బ్యాక్, స్లీవ్ లెస్ బ్లౌజ్ లు ధరిస్తే కూల్ గా, స్టైలీష్ గా కనిపిస్తారు. సిల్వర్ లేదా గోల్డ్ కలర్ ఉన్న పూసలు, ఎంబ్రాయిడరీ బ్లౌజులు టిష్యూ, చిఫాన్, సిల్క్ చీరలకు బాగుంటాయి. ఇవి ఆఫ్ లైన్ లో ఎక్కడైనా దొరుకుతాయి.
ఈ రోజుల్లో చీరలతో జాకెట్లను ధరించే ట్రెండ్ పెరిగిపోయింది. ఫ్యాషన్ షో లలో ఇలా ఎక్కువ ధరిస్తుండటం మీరు చూసే ఉంటారు. అప్పటి నుంచి యువత కూడా దీన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు స్టైలిష్ గా కనిపించాలంటే చీరతో జాకెట్ ను ధరించండి. ఇది మీకు ఇండో బెస్ట్రన్ లుక్ ను ఇస్తుంది. అయితే చీరల మీదికి కాంట్రాస్ట్ కలర్ జాకెట్లను వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా హెవీ వర్క్ చీరలకు ఈ లుక్ బాగుంటుంది.
56
డిఫరెంట్ డ్రేప్
చీరలో స్టైల్ గా కనిపించాలంటే మీరు చీర కట్టుకునే విధానాన్ని మార్చాలి. అవును చీర కట్టుకునే స్టైల్ కూడా మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. ఇందుకోసం మీరు చీరను ధోతీలాగ లేదా సీతాకోకచిలుక విధానంలో కట్టుకోవచ్చు.
66
బెల్ట్ నుంచి ఫ్యూజన్ లుక్
మన అమ్మమ్మలు, నానమ్మలు కేవలం పెళ్లిలోనే వడ్డానం పెట్టుకునే వారు. ఇప్పుడు ఇది పెట్టుకోవడం కామన్ అయ్యింది. అయితే అప్పటిలా కాకుండా.. అందంగా ఉండే బెల్టులను పెట్టుకుంటున్నారు. అంటే ట్రెడీషనల్ చీరలో మోడ్రన్ గా కనిపించేందుకు లెదర్ బెల్ట్ లేదా మెటాలిక్ కలర్ బెల్టును పెట్టుకుంటున్నారు. ఇది చీరను చెక్కు చెదరకుండా ఉంచడమే కాకుండా.. మీరు స్టైలిష్ గా కనిపించేలా కూడా చేస్తుంది. ఫ్యాషన్ డిజైన్లు ఈ లుక్ లో ఎక్కువగా కనిపిస్తారు.