PCOD తో హార్ట్ ఎటాక్ ముప్పు.. తప్పించుకునేదెలా..?

First Published | Nov 14, 2021, 11:54 AM IST

సుమారు 15 శాతం నుండి 20 శాతం మంది స్త్రీలకు PCOD ఉందన్నారు. PCODకి కార్డియోవాస్కులర్ డిసీజ్ (CDV)తో ప్రత్యక్ష సంబంధం ఉందని, ఇది వారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ ముధ్యకాలంలో ముఖ్యంగా యువత గుండె జబ్బు సమస్యలు ఎక్కువౌతున్నాయి. నడి వయసులోనే గుండె నొప్పి వచ్చి  ప్రాణాలు పోతున్నవారు పెరిగిపోతున్నారు. విపరీతమైన పని ఒత్తిడి కూడా దానికి కారణమౌతోంది. కాగా..  ఈ మధ్య స్త్రీలలో PCOD సమస్య ఎక్కువగా ఉంటోంది.  చాలా మంది యువతులు చిన్న వయసులోనే ఈ పీసీఓడీ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా నెలసరి క్రమం తప్పడం.. సంతాన సమస్యలు రావడం లాంటివి మనకు తెలుసు. అయితే.. ఇవి కాకుండా.. ఈ పీసీఓడీ  కారణంగా హార్ట్ ఎటాక్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మెదాంత హాస్పిటల్‌లోని కార్డియాలజీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అల్కేష్ జైన్ ప్రకారం, పిసిఒడి లేని వారితో పోలిస్తే పిసిఒడి ఉన్న మహిళలు గుండె జబ్బులు, ముఖ్యంగా అటాక్ లేదా స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉందన్నారు. 

Latest Videos


pcod

సుమారు 15 శాతం నుండి 20 శాతం మంది స్త్రీలకు PCOD ఉందన్నారు. PCODకి కార్డియోవాస్కులర్ డిసీజ్ (CDV)తో ప్రత్యక్ష సంబంధం ఉందని, ఇది వారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

పీసీఓడీ ఉన్న మహిళల్లో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం 3 శాతం ఎక్కువగా ఉందన్నారు. పిసిఒడి తో బాధపడుతున్నవారిలో సహజంగానే.. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం  హార్మోన్ల ఆటంకాలు జరుగుతూనే ఉంటాయి.  ఈ కారకాలు గుండెలోని ధమనులలో అడ్డంకులు ఏర్పడటానికి కారణమవుతాయి. లేదంటే.. మెదడుపై ప్రభావం చూపపున్నాయి. గుండె ధమనుల్లో ప్రభావం చూపిస్తే.. హార్ట్ స్ట్రోక్, అలాకాదు.. మెదడుపై చూపిస్తే.. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.


అయితే.. ఈ ప్రభావం మహిళలలపై 25శాతం నుంచి 35 శాతం ఉందన్నారు. ముఖ్యంగా మోనోపాజ్ దశకు దగ్గరకు వచ్చిన వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందట. ఆ దశకు దూరంగా ఉన్నవారిలో కాస్త ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

pcod

ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ హార్మోన్లు స్త్రీలకు రక్షణగా ఉంటాయి. మోనోపాజ్ దశలో ఈ హార్మోన్లు విడుదల తగ్గుతుంది. ఈ సహజ రక్షణను కోల్పోయిన తర్వాత, 50 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో స్ట్రోక్ సంఘటనలు అకస్మాత్తుగా పెరుగుతాయి.

గుండె జబ్బులను నివారించడానికి, వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని డాక్టర్ జైన్ సూచిస్తున్నారు, బిపి, లిపిడ్ స్థాయిలు , కొలెస్ట్రాల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పారు. ఇక.. మద్యం, దూమ పానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ 30 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు.. వారానికి ఐదుసార్లు వ్యాయామం చేయడం వల్ల  ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

click me!