శోభిత-నాగ చైతన్య : 8 గంటలకు పైగా పెళ్లి వేడుక.. చాలానే ఉన్నాయి.. !

Published : Nov 27, 2024, 10:28 PM ISTUpdated : Nov 27, 2024, 10:31 PM IST

Sobhita Dhulipala, Naga Chaitanya : శోభిత, నాగ చైతన్యలు డిసెంబర్ 4న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్ప‌టికే వివాహ వేడుక‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పెళ్లి వేడుక‌ల‌కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  

PREV
15
శోభిత-నాగ చైతన్య : 8 గంటలకు పైగా పెళ్లి వేడుక.. చాలానే ఉన్నాయి.. !
Naga Chaitanya Sobhita Dhulipalas wedding

Naga Chaitanya Sobhita Dhulipalas wedding : శోభితా ధూళిపాళ, నాగ చైతన్యలు పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆహ్వానంలో వారి కుటుంబ సభ్యుల పేర్లు, ప్రత్యేక వేడుక‌ల‌కు సంబంధించిన తేదీలు ఉన్నాయి. ఈ జంట తమ అతిథుల పట్ల ప్రేమ, గౌరవ గుర్తింపుగా వివాహ ఆహ్వానంతో పాటు గూడీస్ బాస్కెట్‌ను బహుమతిగా ఇచ్చినట్లు స‌మాచారం.

25
Naga Chaitanya-Sobhita Dhulipala Marriage

వివాహ ఆహ్వానంతో పాటు ఇచ్చిన‌ గూడీస్ బాస్కెట్ లో ఒక వ‌స్త్రం ముక్క, చెక్క స్క్రోల్, ఆహార ప్యాకెట్లు, వివిధ మిఠాయి వస్తువులు ఉన్నాయి. ఆహ్వానంలో ఆలయాలు, గంటలు, అరటి చెట్లు, ఆవు చిత్రాలు ఉన్నాయి. ఇవి ఈ స్టార్ క‌పుల్ జోడీ వ్యక్తిగత, సాంస్కృతిక స్పర్శను జోడించాయి. నాగ చైత‌న్య‌-శోభిత వివాహానికి ముందు వేడుకలు అక్టోబర్‌లోనే ప్రారంభమయ్యాయి. నటి తన ఇంట్లో జరిగిన సాంప్రదాయ వేడుకలకు సంబంధించిన దృశ్యాల‌ను పంచుకున్న సంగ‌తి తెలిసిందే.

35

పెళ్లిని ఘ‌నంగా జ‌ర‌ప‌డానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తమ పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ కపుల్ శోభితా ధూళిపాళ-నాగ చైతన్య డి-డే రోజున ఎనిమిది గంటల పాటు ఆచారాలు నిర్వహించనున్నట్లు సంబంధిత‌ వర్గాలు తెలిపాయి. ఈ జంట తమ జీవితంలో అత్యంత ముఖ్య‌మైన రోజు కోసం సిద్ధమవుతున్న స‌మ‌యంలో వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా, పాతకాలం నాటి అనేక విష‌యాల‌తో 8 గంట‌ల‌కు పైగా వివాహ వేడుక‌ జరుగుతుందని వారి స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

45

“శోభిత-నాగ చైతన్య వారి వివాహం కోసం తెలుగు బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం 8 గంటలకు పైగా వివాహ ఆచారాలు జరగ‌నున్నాయి” అని వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "సాంస్కృతిక అంశాలకు గౌరవం ఇవ్వడానికి, తెలుగు వివాహానికి సంబంధించిన అన్ని అందమైన వివరాలకు గౌరవం-శ్రద్ధ ఇవ్వడానికి వారు 8 గంటలకు పైగా సాంప్రదాయ హార్డ్ కోర్ పాతకాలం నాటి వివాహాన్ని జరుపుతున్నారు" అని  పేర్కొన్నారు. డిసెంబర్ 4న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది.

55

ఇక పెళ్లి రోజు శోభిత సాంప్రదాయ కంజీవరం పట్టు చీరను ధ‌రించ‌నుంద‌నీ, ఇది నిజమైన బంగారు జరీతో అందంగా అలంకరించార‌ని స‌మాచారం. "శోభితా ధూళిపాళ తన తల్లితో కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు నిజమైన బంగారు జరీతో కూడిన అందమైన కంజీవరం సిల్క్ చీరను ఎంచుకుంది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరులో నేసిన సాధారణ తెల్లటి ఖాదీ చీరతో పాటు సంప్రదాయాన్ని అనుసరించి చైతన్య కోసం మ్యాచింగ్ సెట్‌ను కూడా తీసుకున్నారు. శోభిత పెళ్లికి సంబంధించి ప్రతి ప‌నిలో వ్యక్తిగతంగా పాల్గొంటుంది" అని వారి స‌న్నిహితులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories