శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ HCL కార్పొరేషన్ CEO. ఆమె నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ చదివారు, అక్కడ ఆమె రేడియో, టెలివిజన్, చిత్రనిర్మాణంలో కోర్సు పూర్తి చేసారు. ఆమె వసంత వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. అలాగే కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి MBA కలిగి ఉన్నారు.
లీనా గాంధీ టెవారీ ప్రైవేట్‌గా నిర్వహించబడే ఔషధ సంస్థ USV ఇండియా చైర్పర్సన్. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో (B.Com) బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA)లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు.
గోద్రేజ్ కుటుంబ సభ్యురాలు, నావల్ గోద్రేజ్ కుమార్తె అయిన స్మిత కృష్ణ కుటుంబ వ్యాపారంలో 20 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఆమె ముంబైలోని JB పెటిట్ స్కూల్లో చదువు పూర్తి చేశారు. స్మిత బొంబాయిలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి రాజకీయ శాస్త్రం, చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.