మీరు ప్రతిరోజూ ఒక స్పూన్ నల్ల నువ్వులను తీసుకోవాలి. వీటిని మీరు మీ బ్రేక్ ఫాస్ట్ లో స్మూతీలో చేర్చుకొని అయినా తీసుకోవచ్చు.లేదంటే... ఒక గిన్నె పెరుగులో ఒక టీ స్పూన్ నువ్వులను కలిపి తీసుకోవచ్చు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఖనిజాల శోషణకు కూడా మేలు చేస్తుంది. లేదంటే.. మీరు తినే కూరల్లో కూడా వీటిని చేర్చి తీసుకోవచ్చు.
నువ్వులు-బెల్లం లడ్డు - శీతాకాలంలో, నల్ల నువ్వులు, బెల్లం లడ్డు ఎముకలు, రక్తం జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.
రాత్రి వెచ్చని పాలతో: 1 టీస్పూన్ కాల్చిన నువ్వులను వెచ్చని పాలతో తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. శరీరం వెచ్చగా ఉంటుంది.
శీతాకాలంలో ప్రతిరోజూ ఒక టీస్పూన్ నల్ల నువ్వులు మీ ఎముకలు, జుట్టును బలోపేతం చేస్తాయి, మీకు మెరిసే చర్మాన్ని ఇస్తాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి.. రోజూ ఈ నువ్వులను మీరు డైట్ లో భాగం చేసుకుంటే చాలు.