చలికాలంలో చర్మ సంరక్షణ...
చర్మం పొడిబారకుండా ఉండటానికి, మొటిమలు రావడం తగ్గించడానికి, ప్రకాశవంతమైన రంగును పొందడానికి మీరు దాల్చిన చెక్కను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అర టీ స్పూన్ మెంతుల పొడి, నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ముఖం, మెడ పై ఉన్న మెటిమలపై దీనిని అప్లై చేయాలి. దీనిలోని పోషకాలు ముఖాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
చలికాలంలో మీ చర్మం పొడిగా అనిపిస్తే...క్రీములు, మాయిశ్చరైజర్లను వాడుతూ ఉంటారు. అవి వాడినా కూడా చర్మం పొడిబారినట్లుగా అనిపిస్తుంది అంటే...ఒక 100ఎంఎల్ రోజ్ వాటర్ లో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీనిని రాయడం వల్ల చర్మం పొడిబారే సమస్య ఉండదు. ఎక్కువ తేమగా కూడా ఉంటుంది.