Today Vegetable Prices : మీరు ఈ వారాంతం సంతలో కూరగాయలు కొనేందుకు వెళ్లేముందు వాటి ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏ కూరగాయ ఎంతకు కొనుగోలు చేయాలో తెలుస్తుంది.. తద్వారా డబ్బులు ఆదా అవుతాయి.
Today Vegetable Price : వారాంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు ఇతర పట్టణాల్లోనూ గల్లిగల్లీకి కూరగాయల మార్కెట్లు వెలుస్తాయి. ఉద్యోగులకు సెలవు ఉంటుంది కాబట్టి వీకెండ్ లోనే వారానికి సరిపడా కూరగాయలు కొంటుంటారు. ఇక విద్యార్థులకు కూడా సెలవు ఉంటుంది... కాబట్టి గృహిణులకు సమయం దొరుకుతుంది. అందుకే వీకెండ్ లోనే ఎక్కువగా కూరగాయల సంతలు జరుగుతాయి. మరి మీరు ఈ వీకెండ్ కూరగాయల సంతకు వెళుతున్నారా? అయితే ఓసారి ఇక్కడ కూరగాయల ధరలు తెలుసుకొండి.
25
టమాటా ధర పైపైకి...ఇప్పుడెంత?
మన తెలుగోళ్లు వంటల్లో ఎక్కువగా టమాటా వాడుతుంటారు. ప్రతి వంటకంలోనూ దీన్ని ఉపయోగిస్తుంటారు కాబట్టి తెలుగింటి కిచెన్ లో దీనికి డిమాండ్ ఎక్కువ. అయితే కొద్దిరోజుల క్రితం వరకు రూ.20 పలికిన కిలో టమాటా ఇప్పుడు పైపైకి ఎగబాకుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.35-40 వరకు ఉంది. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో టమాటా పంట దెబ్బతినడమే ఈ ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. మార్కెట్లోకి టమాటా సరఫరా తగ్గుతోంది… కాబట్టి రాబోయే రోజుల్లో టమాటా ధర మరింత పెరుగుతుందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
35
ఉల్లిపాయలు ధర ఎంత?
ఉల్లిపాయలను కూడా తెలుగువాళ్లు వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బిర్యాని నుండి కూరగాయల వరకు ప్రతిదాంట్లో ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఒక్కోసారి ఈ ఉల్లిపాయ ధరలు కంటతడి పెట్టిస్తుంటాయి... కానీ ప్రస్తుతం వీటిధర చాలా తక్కువగా ఉంది. కిలో ఉల్లిపాయలు రూ.20-25 పలుకుతోంది... రూ.100 కి ఐదారుకిలోలు కూడా లభిస్తున్నాయి అయితే ఉల్లిపాయ ధరలు క్రమక్రమంగా పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇవి ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ధర తక్కువగా ఉన్నప్పుడే ఎక్కువగా కొనిపెట్టుకుంటే మంచిది.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.