Weather Report: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. కాగా వచ్చే రెండు రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయన్న దానికి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాదు, ఉదయాన్నే కూడా చలి తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుతున్నాయి. ఉదయం బయటకు వెళ్లేవారికి చలి తీవ్రంగా తాకుతోంది. మంగళవారం (ఈరోజు) చలి తీవ్రత పెరగనున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
25
పొగ మంచుతో వాహనదారుల ఇబ్బందులు
ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడంతో రహదారులపై కనిపించే దూరం తగ్గుతోంది. దీని వల్ల వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైవేలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాల అవకాశాలు పెరుగుతున్నాయి.
35
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు
అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలు, యానం, రాయలసీమలో వచ్చే మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయి.
రాబోయే రెండు రోజులలో కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు, యానం, రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పులు కనిపించకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
55
తెలంగాణలో చలి హెచ్చరిక
హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం దక్షిణ ఆంధ్ర కోస్తా తీరానికి సమీపంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకు తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగనుంది. రాబోయే రెండు రోజుల్లో కొన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది.