iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !

Published : Dec 29, 2025, 11:45 PM IST

iBomma Ravi : ఐబొమ్మ పైరసీ కేసులో రవి పోలీసు కస్టడీ ముగిసింది. విచారణలో కీలక అంశాలు వెలుగుచూశాయి, కోర్టు ఆవరణలో రవి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఐబొమ్మ రవి రివర్స్ అటాక్ వీడియోలు వైరల్ గా మారాయి. 

PREV
14
ఐబొమ్మ పైరసీ కేసు: 12 రోజుల కస్టడీ ముగింపు, రవి సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేసి పరిశ్రమకు నష్టం కలిగించాడనే ఆరోపణలపై అరెస్టైన రవి 12 రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించిన అనంతరం, వైద్య పరీక్షల కోసం రవిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

24
ఐబొమ్మ రవి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు ఏమిటి?

కస్టడీ సమయంలో రవి ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అతడికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్టు గుర్తించి, సుమారు రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఫేక్ ఐడీల సృష్టి, స్నేహితుల డాక్యుమెంట్ల వినియోగం వంటి అంశాలపై లోతైన విచారణ సాగింది. ప్రహ్లాద్ అనే వ్యక్తికి చెందిన సర్టిఫికెట్లు దుర్వినియోగం చేశాడన్న అనుమానాలతో అతడిని రవి ఎదుటే ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

34
మీడియాతో రవి కామెంట్స్ వైరల్

కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన రవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపై వస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలను అతడు తీవ్రంగా ఖండించాడు. “నన్ను నేరస్థుడిగా తేల్చే ఆధారాలు ఏవి? పోలీసులు చెబితే నేరం చేసినట్టు అవుతుందా?” అంటూ ప్రశ్నించాడు. అలాగే, తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోనే ఉంటున్నానని స్పష్టం చేశాడు. విదేశీ పౌరసత్వం తీసుకున్నా అక్కడ నివసించడం లేదని పేర్కొన్నాడు. తనపై ఉన్న ఆరోపణలన్నీ కోర్టులోనే తేల్చుకుంటానని రవి స్పష్టం చేశాడు.

44
సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక

ఇక సైబర్ క్రైమ్ డీసీపీ మాట్లాడుతూ, రవి విచారణలో పలు కీలక వివరాలు సేకరించినట్టు వెల్లడించారు. ఫేక్ ఐడీలు, పైరసీ వెబ్‌సైట్ల నెట్‌వర్క్, బెట్టింగ్ యాప్స్‌తో ఉన్న అనుమానాస్పద లింకులపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. అవసరమైతే మరిన్ని అరెస్టులు కూడా ఉంటాయని హెచ్చరించారు. భవిష్యత్తులో పైరసీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories