సౌదీ రోడ్డు ప్రమాదంలో హైదరబాదీలు మృతి ... వివరాల కోసం ఈ నెంబర్లకు కాల్ చేయండి

Published : Nov 17, 2025, 10:58 AM ISTUpdated : Nov 17, 2025, 11:03 AM IST

Mecca Bus Accident : పవిత్రమైన మక్కా, మదీనాను సందర్శించేందుకు వెళ్లిన భారతీయులు రోడ్డు ప్రమాదానిక గురై దేశంకాని దేశంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఎక్కువమంది హైదరబాదీలు ఉన్నట్లు సమాచారం. వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి.  

PREV
15
సౌదీ రోడ్డు ప్రమాదంలో హైదరబాదీల దుర్మరణం

Saudi Bus Accident : తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బస్సు ప్రమాదాలగురించి మర్చిపోకముందే విదేశాల్లో బస్సు ప్రమాదం జరిగింది. ఇందులో ప్రాణాలు కోల్పోయింది మన తెలుగువాళ్లే. పవిత్రమైన మక్కాతో పాటు ఇతర ప్రాంతాల సందర్శన కోసం ఇండియా నుండి కొందరు సౌదీ అరేబియాకు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. ఇలా హైదరాబాద్ నుండి కూడా చాలామంది ముస్లింలు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. వీళ్లంతా గత అర్థరాత్రి సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మక్కా యాత్రకు వెళ్లిన తమవారు ఇలా ప్రమాదానికి గురయి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది... తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన మొదలయ్యింది.

25
తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూం

సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో మరణించినవారిలో ఎక్కువమంది హైదరబాదీలే ఉన్నారు. హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతానికి చెందిన 16 నుండి 18 మంది ఈ బస్సు ప్రమాదంలో మరణించినట్లు సమాచారం అందుతోంది. ట్రావెల్స్ సంస్థలు వీరిని సౌదీకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మక్కా యాత్రకు వెళ్లిన తమవారు ఎవరైనా ఉన్నారేమోనని చాలామంది కంగారుపడుతున్నారు. కానీ వారికి తగిన సమాచారం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటుచేసింది... ఫోన్ నెంబర్లు ప్రకటించింది. 

తెలంగాణ సచివాలయం కంట్రోల్ రూం నెంబర్లు 79979 59754, 99129 19545 లకు ఫోన్ చేసి సౌదీ అరేబియా ప్రమాదం గురించి సమాచారం తెలుసుకోవచ్చు... బాధిత కుటుంబాలు సహాయ సహకారాలు పొందవచ్చు.

న్యూడిల్లీలోని తెలంగాణ భవన్ లో కూడా కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు తెలంగాణ  అధికారులు. సౌదీ ప్రమాద సమాచారం కోసం ఈ ఫోన్ నెంబర్లకు కూడా బాధిత కుటుంబాలు సంప్రదించవచ్చు.

వందన (రెసిడెంట్ కమీషనర్ పీఎస్) : ఫోన్ నెంబర్ 98719 99044

సీహెచ్. చక్రవర్తి (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) : ఫోన్ నెంబర్ 99583 22143

రక్షిత నైల్ (Liaison Officer): ఫోన్ నెంబర్ 96437 23157

సౌదీ అరేబియాలో ఇండియన్ ఎంబసి హెల్ప్ లైన్ నెంబర్

టోల్ ఫ్రీ నెంబర్ 8002440003

35
ప్రమాదం ఎలా జరిగింది?

భారతదేశం నుండి చాలామంది ముస్లింలు పవిత్రమైన మక్కా, మదీనాలను సందర్శించే సౌదీ అరేబియాకు వెళుతుంటారు. ఇలా ఇటీవల కొందరు ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు... మక్కాను సందర్శించి మదీనాకు వెళుతుండగా ఊహించని ఘటన చోటుచేసుకుంది. బదర్‌-మదీనా మధ్య ముఫరహత్‌ ప్రాంతంలో భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఓ డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో బస్సులోని అందరూ మరణించినట్లు సమాచారం. ప్రమాదసమయంలో బస్సులో మొత్తం 42 మంది ఉన్నారట… వీరిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులు ఉన్నట్లు సమాచారం... అయితే ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

45
సౌదీ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి... అధికారులకు కీలక ఆదేశాలు

సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో హైదరాబాదీలు మరణించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన సీఎం పూర్తి వివరాలు తెలుసుకోవాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీని అదేశించారు. విదేశాంగ శాఖ అధికారులు, సౌదీలోని భారత ఎంబసీ అధికారుల నుండి సమాచారాన్ని సేకరించాలని... తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారో తేల్చాలని సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీఎం ఆదేశాలతో స్పందించిన సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో తెలంగాణకు చెందినవారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని... వారి పూర్తి వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. అలాగే సౌదీలోని ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

55
ఏపీకి చెందినవారు ఉన్నారా?

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు ఉన్నారా? అన్నది తెలుసుకుంటోంది కూటమి ప్రభుత్వం. వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్​, రియాద్​లోని డిప్యూటీ అంబాసిడర్​తో సంప్రదింపులు జరుపుతున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్​ కమిషనర్​, కో ఆర్డినేషన్​ సెక్రెటరీని ఆదేశించారు.  

Read more Photos on
click me!

Recommended Stories