
తెలంగాణ శాసనసభ / శాసనమండలి సభ్యులకు ప్రభుత్వం ఈ క్రింది నెలవారీ సదుపాయాలు ఇస్తుంది:
జీతం: నెలకు రూ.20,000
కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్: నెలకు రూ.2,30,000 (2016 చట్టం ద్వారా పెంపు)
అకామోడేషన్ అలవెన్స్: ప్రభుత్వ నివాసం అందుబాటులో లేని సభ్యులకు నెలకు రూ.25,000
అలాగే సభ సమావేశాలు, కమిటీ సమావేశాలకు హాజరయ్యే రోజులకు రోజుకు రూ.1,000 దినభత్యం ఇస్తారు. సభ ప్రారంభం ముందు ఒక రోజు, ముగిసిన తర్వాత ఒక రోజు కూడా ఇది చెల్లుబాటు. కానీ హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సభ్యులకు సమావేశం జరిగే రోజుకే భత్యం లభిస్తుంది.
రైల్వే ప్రయాణం:
రైలులో ప్రయాణించిన దూరానికి AC టూ-టియర్ టికెట్ ధరకు 1.5 రెట్లు ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తారు.
విమాన ప్రయాణం:
సభ్యులు తమ నియోజకవర్గం లేదా నివాసానికి సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాదు లేదా రాష్ట్రంలో జరిగే కమిటీ సమావేశాలకు విమానంలో ప్రయాణించవచ్చు. అయితే క్లెయిమ్‌కు టికెట్లు తప్పనిసరి.
రోడ్ ట్రావెల్:
ప్రైవేట్ కారులో హైదరాబాదుకు వచ్చే ప్రయాణానికి 1 కిలోమీటరుకు రూ.20, గరిష్టంగా 300 కిలోమీటర్ల వరకు చెల్లిస్తారు.
నివాస సౌకర్యం:
హైదరాబాద్‌లో పూర్తి ఫర్నీచర్‌తో ఉన్న నివాసం, ఉచిత నీరు, ఉచిత విద్యుత్ అందజేస్తారు.
ఉచిత బస్సు ప్రయాణం:
సభ్యుడికి, జీవిత భాగస్వామికి TSRTC బస్సుల్లో నగర, అంతర్గత, అంతర్రాష్ట్ర మార్గాల్లో ఉచిత ప్రయాణం. సభ్యుడు లేదా జీవిత భాగస్వామి లేని సందర్భంలో ఒక సహాయకుడు ఉచితంగా ప్రయాణించవచ్చు.
సభ్యులు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఈ వైద్య సదుపాయాలు అందిస్తుంది:
రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స
ప్రభుత్వ ఆసుపత్రులు లేదా NIMSలో చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్.
విదేశాలలో ప్రత్యేక చికిత్స అవసరమైతే ప్రభుత్వ నిర్ణీత పరిమితిలో సహాయం ఉంటుంది.
అవసరమైన సందర్భంలో ఆర్టిఫిషియల్ లిమ్బ్స్, హియరింగ్ ఎయిడ్స్ వంటి పరికరాలను ప్రభుత్వమే భరిస్తుంది
వైద్య రీయింబర్స్‌మెంట్ పరిమితులు:
అత్యవసర శస్త్రచికిత్సలు (క్యాన్సర్, హార్ట్ సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ మొదలైనవి): గరిష్టం రూ.4 లక్షలు
సాధారణ ప్రభుత్వ చికిత్సల రీయింబర్స్‌మెంట్: రూ.1 లక్ష వరకు
వాహన రుణం: సభ్యులకు కార్ కొనుగోలుకు రూ.30 లక్షలు వరకు రుణం (4% వడ్డీ)
ఫర్నీచర్ అలవెన్స్: ఒక్కో పదవీకాలానికి రూ.10,000 చెల్లింపు
పర్సనల్ అసిస్టెంట్:
ప్రభుత్వ శాఖల నుంచి ఒక PA ని డిప్యూటేషన్‌పై తీసుకునే అవకాశం
పీఏకు నెలకు రూ.1,000 ట్రావెల్ అలవెన్స్ అందిస్తారు.
పింఛన్ పొందుతున్న వ్యక్తిని PAగా నియమిస్తే నెలకు రూ.8,000 రెమ్యూనరేషన్
లైబ్రరీ, రీసెర్చ్ సర్వీసులు:
శాసనసభ ప్రాంగణంలోని ప్రత్యేక లైబ్రరీలో పుస్తకాలు, రిపోర్టులు, రీసెర్చ్ మెటీరియల్ పొందొచ్చు.
ముఖ్య సమాచారంతో న్యూస్ క్లిప్పింగ్స్‌ను కూడా సభ్యులకు అందుబాటులో ఉంచుతారు.
పింఛన్:
మొదటి టర్మ్‌కు నెలకు రూ.30,000
ప్రతి అదనపు సంవత్సరానికి రూ.1,000 పెరుగుదల
మొత్తం పింఛన్ గరిష్ట పరిమితి: రూ.50,000
జీవిత భాగస్వామికి పింఛన్: మరణించిన మాజీ సభ్యుడి జీవిత భాగస్వామికి, అతడు బతికి ఉంటే పొందేంత పింఛన్ ఇస్తారు.
వైద్య సదుపాయాలు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స
NIMS/ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సకు రూ.1 లక్ష వరకు రీయింబర్స్‌మెంట్
ప్రధాన శస్త్రచికిత్సలకు రూ.4 లక్షలు వరకు సహాయం
ఆర్టిఫిషియల్ లింబ్స్, హియరింగ్ ఎయిడ్స్ కోసం రూ.1 లక్ష వరకు రీయింబర్స్‌మెంట్
ఉచిత బస్ ప్రయాణం
మాజీ సభ్యులకు, వారి జీవిత భాగస్వాములకు TSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఇందుకు ప్రత్యేక ID కార్డు ఇస్తారు.