తెలంగాణ‌లో పురుషుల‌కు షాకింగ్ న్యూస్‌.. పెరుగుతోన్న సంతాన స‌మ‌స్య‌లు. అందుకే..

Published : Nov 12, 2025, 02:53 PM IST

Hyderabad: సియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) తెలిపిన వివ‌రాల ప్ర‌కారం తెలంగాణ‌లోని పురుషుల్లో సంతాన స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ఈ స‌మ‌స్య పెరుగుతోన్న నేప‌థ్యంలో AINU కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

PREV
15
పురుషుల ఆరోగ్యంపై AINU ప్రత్యేక దృష్టి

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం (నవంబర్ 19) సందర్భంగా ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) సంస్థ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ బ్రాంచ్‌లో “మెన్స్ వెల్‌నెస్ ప్రోగ్రాం”ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా పురుషుల్లో పెరుగుతున్న వంధ్యత్వం (infertility), లైంగిక సమస్యలపై అవగాహన కల్పించడం, స‌మ‌యానికి పరీక్షలు చేయించుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. AINU వైద్యులు పురుషులు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపకుండా, ప్రారంభ దశలోనే వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

25
తెలంగాణలో పెరుగుతున్న పురుష వంధ్యత్వం

ఎయిన్యూ వైద్యుల ప్రకారం, ప్రస్తుతం హైదరాబాద్‌లో పురుషుల వంధ్యత్వం కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 30% నుంచి 50% వంధ్యత్వ సమస్యల్లో పురుషులకే సంబంధం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో వంధ్యత్వ కేసులు 15–20% మేర పెరిగాయని పేర్కొన్నారు. దీని ప్రధాన కారణాలు:

* ఒత్తిడితో కూడిన జీవనశైలి

* తగిన నిద్రలేకపోవడం

* ఊబకాయం

* పర్యావరణ కాలుష్యం వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గడం

35
మెన్స్ వెల్‌నెస్ ప్యాకేజ్‌లో ఏమేమి ఉంటాయి?

ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య పరీక్షా ప్యాకేజ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో:

* అండ్రాలజిస్ట్‌ (పురుష ఆరోగ్య నిపుణుడు) ద్వారా సంపూర్ణ ఆరోగ్య పరీక్ష

* హార్మోన్ ప్రొఫైలింగ్ (టెస్టోస్టెరాన్ స్థాయి, షుగర్‌, థైరాయిడ్‌, లిపిడ్ ప్రొఫైల్‌ వంటి రక్తపరీక్షలు)

* ప్రోస్టేట్ స్క్రీనింగ్‌, స్క్రోటల్ అల్ట్రాసౌండ్‌, సీమెన్ అనాలిసిస్‌

45
జీవనశైలి అంచనా:

ఈ పరీక్షల ద్వారా వంధ్యత్వం, హార్మోన్ సమస్యలు, లైంగిక దౌర్బల్యం వంటి అంశాలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయవచ్చు. ఈ విష‌య‌మై డా. పూర్ణ చంద్ర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్‌ మాట్లాడుతూ.. “పురుషులు ఎక్కువగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. సామాజిక ఒత్తిడి వల్ల వ్యక్తిగత ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటానికి వెనుకాడతారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ముందస్తు జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంచడం లక్ష్యం.” గా పెట్టుకున్న‌ట్లు తెలిపారు. డా. సూరజ్ పిన్ని, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, అండ్రాలజిస్ట్‌ మాట్లాడుతూ.. “పురుషుల ఆరోగ్యాన్ని చివరి దశలో గుర్తించడం కాకుండా, ముందుగానే పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలిలో మార్పులు, ప్రారంభ చికిత్స మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి,” అన్నారు.

55
ఎయిన్యూ మెన్స్ హెల్త్ సెంటర్ ప్రత్యేకతలు

ఎయిన్యూ సెంటర్ ఫర్ మెన్స్ హెల్త్ & అండ్రాలజీ పురుషుల లైంగిక దౌర్బల్యం, వంధ్యత్వం, ప్రోస్టేట్ సమస్యలు వంటి అంశాలకు ఆధునిక సేవలను అందిస్తోంది. ఇందులో:

* లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ

* ఇంట్రా-కావెర్నోసల్ ఇంజెక్షన్స్‌

* వారికోసెల్ సర్జరీలో ఇన్‌ట్రా ఆపరేటివ్ డాప్లర్‌

* వాటర్ వెపర్ థెరపీ, ప్రోస్టాటిక్ యురేత్రల్ లిఫ్ట్‌ వంటి ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి.

అస‌లేంటీ ఎయిన్యూ..?

ఎయిన్యూ (Asian Institute of Nephrology & Urology) — దేశవ్యాప్తంగా కిడ్నీ, యూరాలజీకి ప్రత్యేకంగా అంకితమైన ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నెట్‌వర్క్‌. 4 నగరాల్లో 7 ఆధునిక ఆసుపత్రులు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా రోగులకు చికిత్స పొందుతున్నారు. 1400కి పైగా రోబోటిక్ యూరాలజీ శస్త్రచికిత్సలు నిర్వ‌హిస్తారు. NABH గుర్తింపు ఉంది. DNB, FNB వంటి పీజీ వైద్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థ ఆసియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్‌లో భాగంగా, భారతదేశంలో యూరాలజీ సేవలకు కొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories