నాగార్జున‌పై కొండా సురేఖ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. అర్థ‌రాత్రి త‌ర్వాత ట్వీట్

Published : Nov 12, 2025, 12:57 PM IST

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ‌ర్సెస్ నాగార్జున వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. నాగ్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ సురేఖ చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం కోర్టు వ‌ర‌కు వెళ్లింది. కాగా తాజాగా సురేఖ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. 

PREV
15
వివాదంపై మంత్రి సురేఖ స్పందన

తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే అందుకు చింతిస్తున్నానని ఆమె తెలిపారు. నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టాలన్న ఉద్దేశం ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. “నా వ్యాఖ్యల్లో ఏదైనా తప్పు ఉంటే అందుకు విచారిస్తున్నాను. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను,” అని సురేఖ అర్థరాత్రి ట్వీట్ చేశారు.

25
వివాదం ఎలా మొదలైంది

గత ఏడాది అక్టోబర్‌లో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్న సమయంలో, మంత్రి కొండా సురేఖ అనుకోకుండా నాగచైతన్య–సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కొండ సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

35
నాగార్జున చర్య – కోర్టు దావా

మంత్రి వ్యాఖ్యలతో తన కుటుంబ గౌరవానికి భంగం కలిగిందని పేర్కొంటూ నాగార్జున నాంపల్లి ప్రత్యేక కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కొండా సురేఖ కోర్టుకు పలు సార్లు హాజరయ్యారు. దాదాపు ఏడాది పాటు ఈ కేసు చర్చనీయాంశంగా నిలిచింది. ఇప్పుడు విచారణకు ముందు రోజు ఆమె చేసిన క్షమాపణ ట్వీట్ మరోసారి ఈ విషయాన్ని హాట్‌టాపిక్‌గా మార్చింది.

45
అర్థరాత్రి ట్వీట్

మంగళవారం రాత్రి 12 గంటలు దాటిన తర్వాత మంత్రి సురేఖ తన ట్విట్టర్ ఖాతాలో క్షమాపణ ప్రకటనను పోస్టు చేశారు. “నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. అనుకోకుండా చేసిన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నాను. నా మాటలను ఉపసంహరించుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. ఈ ట్వీట్ గురువారం (నవంబర్ 13) జరగబోయే కోర్టు విచారణ ముందు రావడంతో రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

55
నాగార్జున స్పందనపై ఆసక్తి

కొండ సురేఖ పోస్ట్‌తో అంద‌రి దృష్టి నాగార్జునపై ప‌డింది. మంత్రి సురేఖ క్షమాపణలపై ఆయన ఎలా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. నాగార్జున కేసు విషయంలో వెనక్కి తగ్గుతారా లేదా అన్న‌ది చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories