Hyderabad: హైదరాబాద్ మహా నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తునన్నాయి. తాజాగా నగరంలో ఎకరం కంటే తక్కువ భూమి రూ. 160 కోట్లకు అమ్ముడుపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాయ్‌దుర్గ్ (Raidurg) ప్రాంతంలో ఉన్న 0.97 ఎకరాల భూమిని రూ. 160.42 కోట్లకు విక్రయించింది. ఇది రాష్ట్ర చరిత్రలో భూమికి లభించిన అత్యధిక ధర కావడం విశేషం. ఈ భూమిని వంశిరాం బిల్డర్స్ అనే ప్రముఖ హైదరాబాదీ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు కలుపుకొని మొత్తం విలువ రూ. 172.45 కోట్లు అయ్యింది.
25
ప్రీమియం ప్రాజెక్ట్ కోసం వంశిరాం బిల్డర్స్ ప్రణాళిక
కొనుగోలు చేసిన ఈ భూమిపై ప్రీమియం మిక్స్‌డ్-యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (అంటే కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్ కలయిక) నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ వెస్ట్రన్ కారిడార్‌లో ఉన్న నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌లో భాగం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌కు మంచి మార్కెట్ డిమాండ్ ఉండనుంది. ఈ వేలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించింది.
35
భూమి ధరల్లో భారీ పెరుగుదల
ఈసారి జరిగిన వేలంలో ప్రతి చదరపు గజానికి రూ. 3,40,000 ధర లభించింది. ఇది 2017లో జరిగిన వేలం (రూ. 88,000/చద.గజం) కంటే నాలుగింతలు ఎక్కువ. అంటే ఎనిమిదేళ్లలో హైదరాబాద్‌లో ప్రధాన ప్రాంతాల భూముల ధరలు భారీగా పెరిగాయి. ఒక ఎకరా అంటే 4,840 చదరపు గజాలు, ఆ మేరకు మొత్తం ధర రూ. 160.42 కోట్లకు చేరింది.
ఇటీవల హైదరాబాద్‌లో భూములు వేలాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌లో, బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ గ్రూప్ 11 ఎకరాల భూమిని రూ. 1,556.5 కోట్లకు కొనుగోలు చేసింది (ఎకరాకు రూ. 141.5 కోట్లు). MSN Labs సంస్థ కూడా రాయ్‌దుర్గ్‌లో 7.76 ఎకరాలను రూ. 177.7 కోట్లు ఎకరాకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత బలంగా ఉన్నాయో చచెబుతున్నాయి.
55
భారత వ్యాపార్ హబ్‌గా హైదరాబాద్
ఈ విషయమై TGIIC వైస్ చైర్మన్ కె. శశాంక మాట్లాడుతూ.. “హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో చెప్పేందుకు ఈ వేలాలు నిదర్శనం. చిన్న స్థలాలపై ప్రీమియం ప్రాజెక్టులకే డిమాండ్ ఎక్కువగా ఉంది,” అన్నారు. ఇక JLL హైదరాబాదు హెడ్ సందీప్ పట్నాయక్ మాట్లాడుతూ.. “ప్రతి చదరపు గజానికి రూ. 3.4 లక్షలు రావడం మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ అవకాశాలను చూపిస్తోంది. ఇది హైదరాబాద్‌ను భారత వ్యాపార హబ్‌గా నిలబెడుతోంది,” అన్నారు.