వాట్సాప్ బిజినెస్ ఈ ఫీచర్ ని ప్రస్తుతం బ్రెజిల్‌లో పరిక్షిస్తోంది. ఒక విధంగా ఫేస్‌బుక్ వాట్సాప్ యాప్‌ని పూర్తిగా ఇ-కామర్స్ యాప్‌గా మార్చడానికి సిద్ధమవుతోంది, రాబోయే ఫీచర్ కూడా అందులో ఒక భాగంగా తెలుస్తుంది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాగా కాకుండా వాట్సాప్‌లో యాడ్స్ లేవు. అయితే రాబోయే రోజుల్లో వాట్సాప్‌లో ప్రకటనలు చూడవచ్చు. అయినప్పటికీ వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా కంపెనీ ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుకుంటుంది. ఇప్పటివరకు వచ్చిన కొన్ని నివేదికలలో ఇన్‌స్టాగ్రామ్ స్టోరిస్ వంటి వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు కనిపిస్తాయని పేర్కొంది. ఆన్‌లైన్ రిటైల్ బిజినెస్ కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో గణనీయమైన పెరుగుదలను చూసింది. ఫేస్‌బుక్ కూడా దాని ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ ఫీచర్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను ఇస్తోంది. ఫేస్‌బుక్ షాపింగ్ కూడా ఇందులో ఒక భాగం.
వాట్సాప్‌లో ఫుడ్, రిటైల్ అండ్ లొకేషన్ సర్వీస్ మొదలైన బిజినెస్ క్యాటగిరిస్ ఉన్నాయి. వాట్సాప్ ప్రైవసీ పాలిసి కారణంగా కొంతకాలం క్రితం విమర్శలు ఎదురుకొంది, తర్వాత కంపెనీ వాట్సాప్ బిజినెస్ అక్కౌంట్స్ కన్వర్జేషన్స్, వినియోగదారుల లొకేషన్ ట్రాక్ చేయదని లేదా ప్రైవేట్ చాట్‌లను చదవలేదని కంపెనీ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రకటనదారులు వినియోగదారులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఉపయోగిస్తున్నారని వాట్సాప్ తెలిపింది. 2014 సంవత్సరంలో ఫేస్‌బుక్ వాట్సాప్‌ను దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం మీకు తెలిసిందే.