గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని అమ్మేయాలంటూ అమెరికా ప్రభుత్వం సదరు సంస్థను ఒత్తిడి చేయడం గమనార్హం.
ప్రపంచంలో గూగుల్ తెలియని వాళ్లు ఎవరైనా ఉంటారా? ప్రపంచంలో ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా ముందుగా వెతికేది గూగుల్ లోనే. అలాంటి గూగుల్ సంస్థ ని అమెరికా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని అమ్మేయాలంటూ అమెరికా ప్రభుత్వం సదరు సంస్థను ఒత్తిడి చేయడం గమనార్హం. దీని కారణంగా గూగుల్ ఏఐ కార్యకాలపాలతో పాటు.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంలో న్యాయశాఖను కూడా ఆశ్రయించింది.
undefined
ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం, గూగుల్ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించే మార్గాలను పరిశీలిస్తున్నారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా క్రోమ్ బ్రౌజర్ విక్రయం కూడా ఉంటుందని సూచించారు. గూగుల్ విభజనకు పిలుపునివ్వడం అమెరికా రెగ్యులేటర్లకు పెద్ద మార్పుగా నిలుస్తుంది,
గూగుల్, న్యాయశాఖ ప్రతిపాదనను గూగుల్ వ్యతిరేకిస్తోంది. చాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ ముఖ్య కార్యనిర్వాహకుడు ఆడమ్ కోవాచేవిచ్, ఈ ప్రతిపాదనలు చట్టపరంగా అసాధారణమైనవి , అనవసరమైనవని పేర్కొన్నారు.