ఇంటర్నెట్ యుగంలో యువతలో ఈ ధోరణి మరింత పెరుగుతోంది. సరదా కోసం చేసే ఈ సెక్స్‌టింగ్ భారీ విపత్తులకు దారితీస్తుందని కూడా మనం చూస్తుంటాము. సెక్స్‌టింగ్ అంటే లైంగిక సందేశాలు, ఫోటోలు లేదా వీడియోలు పంపడం లేదా ఫార్వార్డ్ చేయడం, ప్రధానంగా మొబైల్ ఫోన్‌ల ద్వారా ఇతరులకు పంపించటం సెక్స్‌టింగ్ అంటారు.
undefined
శృంగార సంభాషణలకు, నగ్న ఫోటోలు, వీడియోలను ఒకరికిఓకరు పంపడం సెక్స్‌టింగ్ లో సాధారణం. పెరుగుతున్న ఈ ధోరణిలో యువతీ యువకులు ఎదుర్కొనే నష్టాలు ఏమిటి? ఒక వ్యక్తి మరో వ్యక్తితో నమ్మకంగా ఉంటాడు.
undefined
వారికి పంపిన నగ్న ఫోటోలు వారి అనుమతి లేకుండా లేదా వారికి తెలియకుండా ఇతరులకు చూపించవచ్చు లేదా పంచుకోవచ్చు. అదే ఫోటోలతో బ్లాక్ మెయిల్, సైబర్ బెదిరింపులకు గురి చేసే అవకాశాలు ఉండొచ్చు.
undefined
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి ఉపయోగించే యాప్ కూడా సెక్స్‌టింగ్ లో కీలక పాత్ర పోషిస్తాయి. పంపించిన నగ్న ఫోటోలు లేదా వీడియోలు ఫోన్‌లోనే కాదు, యాప్ సర్వర్‌లో కూడా స్టోర్ అవుతాయి. ఫోన్‌లో డిలెట్ చేసిన క్లౌడ్ స్టోరేజ్ లో ఫోటోలు-వీడియోలను డిలెట్ కాదు.
undefined
ఒకవేళ క్లౌడ్ స్టోరేజ్ సర్వర్ హ్యాక్ అయితే, ఆ ఫోటోలు లీక్ అవ్వడం ఖాయం! 2016లో అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ మహిళకు ఇలాంటి ఒక సంఘటన జరిగింది. హ్యాకర్ ఆమె ఫోటోలను దొంగిలించి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది.
undefined
ఇలాంటి ప్రమాలకు మీ సన్నిహితులు, స్నేహితులు, భాగస్వాములు గురికాకుండా జాగ్రత్త వహించండి. ఒకవేళ ఫోన్ ఎక్కడైన పోయిన, దొంగతనం చేసిన ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు. అవి కాకుండా, మీ ఫోన్ లోని ప్రైవేట్ ఫోటోలను కూడా లీక్ చేయవచ్చు.
undefined