ఈ క్రికెటర్ల భార్యల ఫిట్ నెస్ చూస్తే.. మతి పోవాల్సిందే...

First Published Sep 21, 2021, 1:31 PM IST

క్రికెటర్లే కాదు వారి భార్యలూ ఫిట్ నెస్ విషయంలో ఏమీ తీసిపోలేదు. చాలామంది భర్తలకు పోటీగా తామూ రోజూ వ్యాయామాలు, జిమ్ లు ప్రాక్టీస్ చేస్తారు. ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండడానికీ ఇదే మొదటి మెట్టు అని గుర్తించారు. దీనికోసం హెల్తీ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు. అలాంటి కొంతమంది ఫేమస్ క్రికెటర్ల భార్యలెవరో చూడండి... 

క్రికెట్ అంటే జనాలు ఫీవర్ తో ఊగిపోతారు. తమ అభిమాన క్రికెటర్ల గురించి వారి ఆటతీరు, స్టైల్, తీసుకునే ఫుడ్, మెయింటనెన్స్, వ్యక్తిగత విషయాలు అన్నింట్లోనూ తెగ ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా ఫిట్ గా ఉండడం కోసం వారు చేసే వ్యాయామాలు, తీసుకునే జాగ్రత్తల విషయంలో ఎంతో ఆసక్తి కనబరుస్తారు. క్రికెటర్లకు ఉండే క్రేజ్ అది మరి.

అయితే, క్రికెటర్లే కాదు వారి భార్యలూ ఫిట్ నెస్ విషయంలో ఏమీ తీసిపోలేదు. చాలామంది భర్తలకు పోటీగా తామూ రోజూ వ్యాయామాలు, జిమ్ లు ప్రాక్టీస్ చేస్తారు. ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండడానికీ ఇదే మొదటి మెట్టు అని గుర్తించారు. దీనికోసం హెల్తీ లైఫ్ స్టైల్ ను ఫాలో అవుతున్నారు. అలాంటి కొంతమంది ఫేమస్ క్రికెటర్ల భార్యలెవరో చూడండి... 

అనుష్కా శర్మ (Anushka Sharma) : ఈ కోవలో ముందు వరుసలో ఉంటుంది. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కా శర్మ. అసలే అందాల హీరోయిన్, దీనికి తోడు వరల్డ్ ఫేమస్ క్రికెటర్ ను ఏరికోరి పెళ్లి చేసుకుంది ఆ మాత్రం ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టకపోతే ఎలా? అందాల అనుష్కా శర్మ వారంలో 3,4 రోజులు తప్పనిసరిగా వర్కవుట్స్ చేస్తుందట. ఈ రొటీన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వదిలేయలేదట. అనుష్క ఎక్కువగా స్ట్రెంథ్ ట్రైనింగ్, కార్డియో, యోగాలమీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందట. 

గీతా బాస్ర (Geeta Basra) : క్రికెటర్ హర్బజన్ సింగ్ ను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి గీతా బాస్ర. గీతా బస్రా సింగ్ బ్రిటీష్‌లో పుట్టింది. అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది గీతాబాస్ర. డెలివరీ తరువాత కొద్ది కాలానికే  తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకోవడంతో.. గీతాబాస్ర ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ గా మారింది. తన ఫిట్ నెస్ కు కారణం ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలేనని చెబుతోంది ఆమె. దీంతోపాటు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్లే తన ఫిట్ నెస్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చింది.

గీతా బాస్ర (Geeta Basra) : క్రికెటర్ హర్బజన్ సింగ్ ను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి గీతా బాస్ర. గీతా బస్రా సింగ్ బ్రిటీష్‌లో పుట్టింది. అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది గీతాబాస్ర. డెలివరీ తరువాత కొద్ది కాలానికే  తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకోవడంతో.. గీతాబాస్ర ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ గా మారింది. తన ఫిట్ నెస్ కు కారణం ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలేనని చెబుతోంది ఆమె. దీంతోపాటు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్లే తన ఫిట్ నెస్ సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చింది.

నటాషా స్టాంకోవిక్ (Nataša Stanković) : క్రికెటర్ హార్థిక్ పాండ్యాను పెళ్లి చేసుకుంది నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవిక్. సహజంగా మోడల్ అవడంతో నటాషా ఫిగర్ అద్భుతంగా తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. నటాషా ప్రముఖ డ్యాన్సర్ కూడా. తను క్రమం తప్పకుండా జుంబా ప్రాక్టీస్ చేస్తుంది. స్విమ్మింగ్, బాక్సింగ్ కూడా తన రొటీన్ లో భాగం. వీటి విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. అందుకే ఆమె బిడ్డకు జన్మనిచ్చిన 18 రోజుల్లోనే తిరిగి తన పూర్వ రూపాన్ని పొందగలిగింది.

సాక్షి సింగ్ ధోని (Sakshi Singh Dhoni) : ఇండియన్ క్రికెట్ లో ధోనీకి ఓ ప్రత్యేకస్థానం ఉంది. మిస్టర్ కూల్ గా పేరుంది. ఇక ధోని సాక్షితో ప్రేమలో పడడం, పెళ్లి చేసుకోవడం ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ధోని భార్య అయిన సాక్షి సింగ్ ధోని ఫిట్ నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. తన ఫిట్ నెస్ కు కారణం తన కూతురు జీవానే అంటుంది ఈ మమ్మీ. కారణం.. తన వెనక పరిగెత్తి పరిగెత్తి తనకు పిడేల్ లాంటి ఫిట్ నెస్ వచ్చిందంటూ సరదాగా చెబుతోంది. సాక్షి ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ నే తింటుంది. ఇవే తన ఫిట్ నెస్ సీక్రెట్స్ అని చెబుతోంది. 

దీపికా పల్లికల్ (Dipika Pallikal) : దీపికా స్వయంగా స్క్వాష్ ఛాంపియన్. క్రికెటర్ దినేష్ కార్తీక్ భార్య. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫిట్ నెస్ కే గురు లాంటి విరాట్ కోహ్లీకే దీపికా స్పూర్తినివ్వడం. ఆమెను చూసి మరింత ఫిట్ నెస్ కోసం విరాట్ ఇన్ స్పైర్ అయ్యాడట. కండలు తిరిగిన ఈ స్క్వాష్ ప్లేయర్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. పైలెట్స్, హెవీ లిఫ్టింగ్స్ తో తన బాడీని తెగ కష్టపెడుతుంది. అదే తన ఫిట్ నెస్ సీక్రెట్, గేమ్ స్ట్రాటజీ అంటుంది దీపికా. 

సంజన గణేశన్ (Sanjana Ganesan) : కామెంటేటర్ సంజన గణేశన్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను పెళ్లి చేసుకుంది. సంజన చక్కటి ఫిట్ నెస్ తో టోన్డ్ అండ్ హెల్తీగా ఉంటుంది. ఎక్కువగా రన్నింగ్ చేయడానికి ఇష్టపడుతుంది సంజన. తన ఫిట్ నెస్ కోసం రన్నింగ్ తో పాటు ట్రెడ్ మిల్ మీద పరిగెత్తడం, యోగా లాంటివి చేస్తుందట.

సాగరిక ఘట్గే (Sagarika Ghatge) : చక్ దే సినిమా గుర్తుందా? అయితే సాగరిక మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె క్రికెటర్ జహీర్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. సాగరిక భర్తతో కలిసి వర్కవుట్స్ చేయడానికి బాగా ఇష్టపడుతుంది. వర్కవుట్స్ చేయడం ఆమె ఫేవరేట్ యాక్టివిటీ. ఇక ఆమె నిత్యం చేసే కొన్ని ఎక్సర్ సైజుల్లో క్రాస్ ఫిట్ ట్రైనింగ్, ప్లాంక్స్, కిక్ బాక్సింగ్, రన్నింగ్, యోగాలు ఉన్నాయి. వీటిని బట్టే అర్థమవుతుంది కదా.. సాగరిక ఏ రేంజ్ లో వర్కవుట్స్ చేస్తుందో... 

click me!